ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లును మొదలు పెట్టిన అధికారులు వెంటనే ఈవీఎం ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేస్తారు. అయితే ఈ సారి ప్రభుత్వ ఉద్యోగులు అంతా కూడా కూడా ముకుమ్మడిగా  కూటమికి ఓటు వేశారు. దీనికి కారణం ఒకటే రాష్ట్రంలో గత ఐదేళ్లుగా వైసీపీ అరాచక పాలన చూసి ఓర్వలేక గంప గుత్తుగా టీడీపీ కూటమికి ఓటు వేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అలాగే ప్రతి నెల ఒకటో తారీకు జీతం పడకపోవడం వంటివి అలాగే వారికీ రావాల్సిన డిఏలు, పెన్షన్ లు కూడా సమయానికి అందకపోవడం, ఎన్నేళ్ల నుంచో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచకపోవడం వంటివి వైసీపీకి పెద్ద దెబ్బ తగిలింది. 

రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు తామే గెలుస్తున్నాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వైసీపీ లో బాగా పెరిగిపోవడం వంటివి కూడా వైసీపీ ఓటమికి ప్రధాన కారణంగా మారింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవడం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసుకోవడం వంటివి కూటమికి బాగా కలిసి వచ్చింది. ఈ సారి కూటమి 160 సీట్లకు పైగా గెలుచుకోబోతుంది. గత ఎన్నికలలో 151 సీట్లు తెచ్చుకున్న వైసీపీ ఈ సారి ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేకపోయింది.. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అదే పేరు కొంసాగించనుంది.1996 ఎన్టీఆర్ మరణం తరువాత ఈ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం జరిగింది.2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు.అప్పట్లో దీనిపై తీవ్ర దుమారం లేపింది. తాజాగా కూటమి విజయంతో మరోసారి ఎన్టీఆర్ పేరు ఆ యూనివర్సిటీకి పెట్టడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: