కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ ఇద్దరు తెలుగుదేశం పార్టీకి గత ఐదేళ్లలో ఎలా కొరకరాని కొయ్యలుగా మారారో చూస్తూనే ఉన్నాం. 2014, 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచిన వంశీ.. అనంతరం వైసీపీకి దగ్గరయ్యారు. ఈ ఎన్నికలలో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా.. చేయరా.. అన్న సస్పెన్స్ కు తెరదించుతూ ఆయన అసెంబ్లీ బరిలో దిగారు. తాజా ఎన్నికలలో మరోసారి 2019లో పోటీ పడిన పాత ప్రత్యర్ధులే పోటీపడ్డారు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంశీ.. ఈసారి వైసీపీ నుంచి బరిలో ఉంటే ... 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఈసారి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో ఉన్నారు.


నియోజకవర్గంలో గన్నవరం నగర పంచాయతీతో పాటు గన్నవరం , బాపులపాడు, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈసారి ఎన్నికలకు ముందు సరళి చూస్తే.. గన్నవరంలో తెలుగుదేశం కచ్చితంగా గెలుస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. నియోజకవర్గంలో పార్టీ మారడంతో పాటు చంద్రబాబును, లోకేష్ ను చివరికి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిని సైతం వంశీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం అన్ని వర్గాల ప్రజల్లోనూ వంశీ పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. పార్టీ మారినా దానిని అందిపుచ్చుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారన్న చర్చ కూడా జరిగింది.


ఇటు గత ఎన్నికలలో వైసీపీ నుంచి వంశీ పై కేవలం ఎనిమిది వందల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్ల‌గడ్డ ఈసారి కసితో పని చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆయనకు బాగా సహకరించాయి. ఓవరాల్ గా పోలింగ్ సర్వేలో యార్లగడ్డ గెలుస్తారన్న ప్రచారమే ఎక్కువగా జరిగింది. ఇక చివ‌ర‌కు కౌంటింగ్ రోజు 15 రౌండ్లు ముగిసే స‌రికే వంశీ ఢ‌మాల్ అయిపోయాడు. లోకేష్ కూడా బాగా కాన్‌సంట్రేష‌న్ చేసి యార్ల‌గ‌డ్డ‌కు సీటు ఇప్పించి మ‌రీ త‌న రివేంజ్ తీర్చుకున్నారు. 15 రౌండ్లు ముగిసే స‌రికే యార్ల‌గ‌డ్డ‌కు 30 + వేల భారీ మెజార్టీ వ‌చ్చేసింది. దీంతో వంశీని గ‌న్న‌వ‌రం నుంచి పంపేసి యార్ల‌గ‌డ్డ స‌గ‌ర్వంగా అసెంబ్లీ ఎంట్రీ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: