గుంటూరు జిల్లాలోని మరో కీలకమైన నియోజకవర్గం మంగళగిరి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో  ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేదే ఉత్కంఠగా ఉంది.  దీనికి ప్రధాన కారణం అక్కడ పోటీ చేసేది మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్. ఈయన టిడిపి కూటమి నుంచి ఈసారి బరిలో ఉన్నారు. ఎలాగైనా ఈ ఎలక్షన్స్ లో విజయం సాధించాలని తాపత్రయపడుతున్నారు. ఇక లోకేష్ కు ప్రత్యర్థిగా  మురుగుడు లావణ్య బరిలో ఉంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. 

గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే నారా లోకేష్ పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి వైసిపి రామకృష్ణారెడ్డిని తప్పించి, మురుగుడు లావణ్యను బరిలో దింపింది. ఈమెను ప్రకటించడానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయట. అయితే ఈమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు కూతురు అవుతారట. అంతేకాకుండా మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు కోడలు అవుతారట. అంతేకాకుండా ఇక్కడ చేనేత సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. లావణ్య కూడా అదే వర్గానికి చెందిన నేత కావడంతో ఓట్లు చాలా ప్రభావితం అవుతాయని ఆలోచన చేసి వైసిపి ఈ అభ్యర్థిని బరిలో ఉంచింది.    

మరి ఈ ఇద్దరు కీలక నేతల మధ్య జరిగినటువంటి పోటీలో ప్రజలు ఎవరికి ఎక్కువగా ఓట్లేశారు. ఎవరు గెలవ బోతున్నారు.  ఎవరికి ఎంత మెజారిటీ వచ్చింది అనేది తెలుసుకుందాం. మంగళగిరిలో టిడిపి అభ్యర్థి నారా లోకేష్ ఇంకా నాలుగు రౌండ్లు మిగిలి ఉండగానే 1,28,693 ఓట్లు సాధించారు. సమీప అభ్యర్థి మురుగుడు లావణ్య కు  52,452 ఓట్లు వచ్చాయి.దీంతో లోకేష్ కు ఇప్పటికే 76,241 మెజారిటీ ఉంది. ఇంకా నాలుగు రౌండ్లు ముగిసేసరికి  ఆయన మెజారిటీ దాదాపుగా లక్షకు దగ్గరికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా  మంగళగిరిలో మురుగుడు లావణ్య కు ప్రజలంతా మంగళం పాడి లోకేష్ కు  మంగళహారతి పట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: