కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి . ఉదయం 6 గంటల నుండే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. మొదట ప్రభుత్వ ఉద్యోగస్తులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు . అందుకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు.

ఆ అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఇక ఇప్పటికే కొన్ని చిన్న నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలను కూడా ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం వర్గానికి సంబంధించిన ఫలితాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాంతంలో వై సి పి పార్టీ అభ్యర్థిగా గొర్ల కిరణ్ కుమార్ పోటీ చేయగా ... ఈ ప్రాంత సీటును పొత్తులో భాగంగా బి జె పి పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎన్ ఈశ్వరరావు దక్కించుకున్నారు.

ఇకపోతే ప్రస్తుత అధికార పార్టీ అభ్యర్థి కావడంతో గొర్ల కిరణ్ కుమార్ కు భారీ క్యాడర్ ఉండడం ఈయనకు బాగా కలిసి వచ్చే అంశంగా ఇక్కడి ప్రజలు మొదటి నుండి చెప్పుకొస్తున్నారు. ఇక తెలుగుదేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తూ ఉండడంతో ఈయనకు బిజెపి అనుకూల ఓట్లతో పాటు తెలుగు దేశం , జనసేన అనుకూల ఓట్లు కూడా పడే అవకాశం ఉండడంతో వీరిద్దరి మధ్య గట్టి పోటీనే నెలకొనే అవకాశం ఉంది అని జనాలు భావిస్తూ వచ్చారు. ఇకపోతే తాజాగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన రిజల్ట్ విడుదల అయింది. ఇక ఈసారి ఈ ప్రాంతంలో అవలీలగా బిజెపి అభ్యర్థి అయినటువంటి ఎన్ ఈశ్వర రావు గెలుపొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: