ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలకంగా మారిన నియోజకవర్గాల్లో గుంటూరు ఈస్ట్ కూడా ఒకటి. అలాంటి గుంటూరు ఈస్ట్ కు ఒక ఘనమైన చరిత్ర ఉంది.  1983 నుంచి ఈ నియోజకవర్గంలో ముస్లిం  కమ్యూనిటీకి చెందిన వారే పోటీ చేస్తున్నారు.  1952లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ నియోజకవర్గ గుంటూరు గానే ఉండేది. 1955 - 1978 వరకు కాంగ్రెస్ అభ్యర్థులే ఇక్కడ విజయబాహుట ఎగరవేశారు. 1983 ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి ఇక్కడ టిడిపి జెండా ఎగిరింది. ఈ పార్టీ తరఫున యూకే పటాన్ గెలుపొందారు.

 ఆ తర్వాత 1985 - 1989లో  మహమ్మద్ జానీ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. అలా వరుసగా ఓడిపోయిన టిడిపి మళ్లీ పుంజుకొని  1994 -99 ఎన్నికల్లో  టిడిపి తరఫున జియావుద్దీన్ వరుసగా రెండుసార్లు గెలుపొందారు. ఇక అప్పటి నుంచి ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరలేదు. రెండు దశాబ్దాలుగా టిడిపి నుంచి పోటీ చేసిన నేతలు ఓడిపోతూనే ఉన్నారు. 2004లో షేక్ సుభాని కాంగ్రెస్ , ఆ తర్వాత గుంటూరు వన్ రద్దయి గుంటూరు ఈస్ట్ గా ఏర్పడింది. 2009లో షేక్ మస్తాన్ వలి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి  గెలుపొందారు. ఇక 2014-2019 సార్వత్రిక ఎన్నికల్లో  వైసీపీ నుంచి మహమ్మద్ ముస్తఫా రెండుసార్లు గెలిచారు.

ఈసారి ఎన్నికల్లో ముస్తాఫా పోటీ చేయకుండా ఆయన కుమార్తె  నూరి ఫాతిమాను పోటీ చేయిస్తున్నారు. ఇక టిడిపి నుంచి మహమ్మద్ నజీర్ బరిలో ఉన్నారు. అలాంటి ఈ తరుణంలో విజయం ఎవరిని వరించిందో, ఇప్పుడు చూసేద్దాం. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మహమ్మద్ నజీర్ అహ్మద్ కు మొత్తం 1,00,815 ఓట్లు పడ్డాయి. సమీప వైసిపి  అభ్యర్థి  నూరి ఫాతిమా షాహిక్ కు 68,853ఓట్లు వచ్చాయి. మహమ్మద్ నజీర్  31 వేల 962 ఓట్ల మెజారిటీ సాధించి 20 ఏళ్ల చరిత్రను తిరగరాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: