ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మే 13 వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటల నుండే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో , కట్టు దిట్టమైన భద్రతా చర్యల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన సిబ్బంది అందుకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది.

ఇక ఆ తర్వాత ఈవిఏం ఓట్లను లెక్కించడం మొదలు పెట్టారు. మొత్తం 14 టేబుల్ లలో ఒక్కో రౌండ్ కు ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి. తాజాగా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ నియోజకవర్గం నుండి వై సీ పీ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పోటీలో ఉండగా ... టిడిపి పార్టీ అభ్యర్థిగా కళా వెంకట్రావు బరిలో ఉన్నారు.

ఇక వై సి పి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న బొత్స సత్యనారాయణ ఇప్పటికే 2004 , 2009 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి వరుసగా రెండు సార్లు ఈ ప్రాంతం నుండి గెలుపొందారు. ఇక 2014 వ సంవత్సరం ఈ ప్రాంతంలో తెలుగుదేశం అభ్యర్థి కిమిడి మృణాళిని గెలుపొందారు. ఇకపోతే ఈయన 2019 వ సంవత్సరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బొత్స సత్యనారాయణ మరోసారి ఈ ప్రాంతం నుండి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

ఇప్పటికే మూడు సార్లు చీపురుపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అయినా బొత్స సత్యనారాయణ నాలుగవ సారి కూడా ఎమ్మెల్యే కావడానికి తన వంతు ప్రయత్నాలు చేశాడు. ఇక కళా వెంకట్రావు , వైసీపీ పార్టీలో సూపర్ క్రేజ్ కలిగిన బొత్స సత్యనారాయణ ఓడించడానికి ఎన్నో ప్రయత్నాలను చేశాడు. అందులో ఆయన సక్సెస్ అయ్యారు. ఇక తాజాగా విడుదల అయిన ఫలితాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వెంకటరావు 86704 ఓట్లను తెచ్చుకోగా , వైసిపి అభ్యర్థి అయినటువంటి బొత్స సత్యనారాయణ 75,177 ఓట్లను తెచ్చుకున్నాడు. దానితో బొత్స సత్యనారాయణ పై తెలుగుదేశం అభ్యర్థి వెంకట్రావు 11527 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: