ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేడు ఉదయం 8 గంటలకు మొదలయింది. రౌండ్ రౌండ్ కు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ అధిక్యం రావడంతో కూటమి విజయం అనివార్యం అయింది..ఊహించని రీతిలో విక్టరీ దిశగా సాగిపోతుంది. కూటమి ఏకంగా 160 సీట్లకు పైగా అధిక్యం సాధించింది.ఇప్పటికి మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కూటమి గెలిచినా ప్రతి నియోజకవర్గంలో భారీ మెజారిటీ తేడాతో గెలుపొందారు. అయితే గత ఎన్నికలలో ఏకంగా 151 సీట్లు సాధించినా వైసీపీ కేవలం 13 సీట్ల అధిక్యం లో నిలిచింది.ఇంతటి భారీ తేడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పార్టీ పోటీ చేసిన 21 నియోజకవర్గాలలో అధిక్యం సాధించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఏమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసారు. అయితే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం లో తిరుగులేని విజయం సాధించింది.ఏకంగా 50 వేల ఓట్ల మెజారిటీతో పవన్ కల్యాణ్ తిరుగులేని విజయం సాధించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''సరికొత్త రాజకీయ మలుపుగా ఈ గెలుపు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ గెలుపు జనం గెలుపు. జనసేనాని గెలుపు. విజనరీ చంద్రబాబు గెలుపు. భరతమాత ముద్దు బిడ్డ గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గెలుపు. నాయకుడి పిలుపుతో మార్పు కోసం పాటుపడిన ప్రతి పౌరుడి గెలుపు. కూటమి విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి జనసైనికుడికి వీరమహిళకి నా ధన్యవాదాలు, శుభాబినందనలు.'' తెలుపుతున్నట్లు నాగబాబు పేర్కొన్నారు.రాష్ట్రంలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రములో వైసీపీ అరాచకాలకు త్వరలోనే టీడీపీ కూటమి చరమ గీతం పాడునుందని కూటమి అభ్యర్థులు, కార్యకర్తలు అభిమానులు టపాసులు కాల్చి పండుగ చేసుకుంటున్నారు.ఇప్పటి నుండి రాష్ట్రంలో సుపరిపాలన రానుంది అని టీడీపీ వర్గాలు సంబరాలు జరుపుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: