పిఠాపురంలో పవన్ అఖండ విజయం.. వెళ్లిపోకే శ్యామల అంటూ నిర్మాత ట్వీట్..!

ఏపీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. 70 వేలకు పైగా మెజారిటీతో ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి ఏపీ ఎన్నికల ప్రచారంలో యాంకర్ శ్యామల వైసిపి తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆమె ఓ సెలబ్రిటీ అయి ఉండి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించలేడు, ఆయాస పడడం, కోపం తప్ప ఆయనకు ఇంకేం తెలియదు.. తాను రాజకీయాలకు.. వైసీపీ నే ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అంటూ యాంకర్ శ్యామల కామెంట్స్ చేసింది. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఎవరు ఊహించని విధంగా ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దాదాపు కుటమిదే విజయం అవుతుందనే విధంగా ఫలితాలు ఉన్నాయి. ఇక ఈ క్రమంలో బేబీ చిత్ర నిర్మాత ఎస్ కే ఎన్ యాంకర్ శ్యామలకో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ..ఆ సినిమాలో వెళ్లిపోకే శ్యామల.. ఏమి బాగా లేదే అంటూ పాటను షేర్ చేశారు.

జనసేన విజయం సందర్భంగా ఆయన ఈ వీడియోను షేర్ చేసినట్లు తెలుస్తుంది. ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన వారంతా.. భలే కౌంటర్ ఇచ్చావు. వైసీపీలో ప్రచారం చేయడం వల్ల నీకు ఎంత డబ్బు కలిసి వచ్చిందో తెలియదు కానీ నెగెటివిటీ మాత్రం బాగా పెరిగింది? సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఆ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లో కి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చెయ్యకపోయినా పర్లేదు కానీ తీవ్రంగా ఆయనని అవమానించావు.. నీకు ఇటువంటి అవమానాలు జరగాలి... అంటూ పవర్ స్టార్ అభిమానులు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: