కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో టఫ్ ఫైట్ నడిచిందనే సంగతి తెలిసిందే. టీడీపీ కూటమి అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో టీజీ భరత్ పోటీ చేయగా వైసీపీ అభ్యర్థిగా ఎం.డి.ఇంతియాజ్ పోటీ చేశారు. గతంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకే అనుకూల ఫలితాలు వచ్చాయి. అయితే వేర్వేరు కారణాల వల్ల వైసీపీ ఈ ఎన్నికల్లో ఇంతియాజ్ కు టికెట్ ఇవ్వడం జరిగింది.
 
టీజీ భరత్ తాను లోకల్ అని నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కూటమి ఇచ్చిన హామీలతో పాటు మరికొన్ని హామీలను అమలు చేస్తానని కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఎండీ ఇంతియాజ్ విషయానికి వస్తే ముస్లిం ఓటర్లు కర్నూలు అసెంబ్లీలో ఎక్కువ సంఖ్యలో ఉండటం, వైసీపీ సంక్షేమ పథకాలపై ఇక్కడి ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉండటం ఆయనకు ప్లస్ అయింది.
 
అయితే కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ పై భరత్ ఏకంగా 19,200 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు యాడ్ చేస్తే భరత్ మెజారిటీ ఎంతో తేలిపోనుంది. వైసీపీ కంచుకోట అయిన కర్నూలు అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి విజేతగా నిలవడం గమనార్హం. భరత్ గెలుపుతో కర్నూలు వాసులు సంబరాలు జరుపుకుంటున్నారు.
 
భరత్ లోకల్ అభ్యర్థి కావడం, కర్నూలు సమస్యలపై ఆయనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంతో కర్నూలును అభివృద్ధి చేసే సరైన నేత భరత్ అని భావించి ప్రజలు ఆయనకే పట్టం కట్టారని తెలుస్తోంది. కర్నూలు ఫలితం భరత్ కు అనుకూలంగా రావడంతో కూటమి నేతల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. భారీ మెజారిటీతో భరత్ విజయం సాధించడం కూటమి నేతల్లో ఆనందాన్ని నింపుతోంది.  టీజీ భరత్ స్థానికులకు పార్టీతో సంబంధం లేకుండా కొన్ని హామీలను ఇవ్వగా ఆ హామీలను నెరవేరుస్తారేమో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: