మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలను నిర్వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అధికార పార్టీ వై సి పి ఒంటరిగా పోటీలోకి దిగగా , ఆంధ్ర రాష్ట్రంలో బలమైన పార్టీలు అయినటువంటి తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిపి పొత్తుల భాగంగా పోటీలోకి దిగాయి. మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు అనగా జూన్ 4 వ తేదీన విడుదల అవుతున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది.

మధ్యాహ్నం నుండే ఒక్కో రిజల్ట్ విడుదల అవుతూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం తాజాగా వెలువడింది. ఇక ఈ ప్రాంతం నుండి వై సి పి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ బరిలో నిలవగా , కూటమి అభ్యర్థిగా కింజరపు అచ్చేన్నాయుడు బరిలో ఉన్నారు. ఇక టి డి పి పార్టీలో అత్యంత సీనియర్ నేత కావడంతో కింజరపు అచ్చేన్నాయుడు ఈ ప్రాంతంలో చాలా ఈజీ గా గెలుపొందుతారు అని కూటమి , నేతలు , కార్యకర్తలు అభిమానులు ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా కింజరపు అచ్చేన్నాయుడు కి ఏ మాత్రం తగ్గకుండా ప్రచారాలను కొనసాగించాడు.

దానితో ఈయన కూడా గెలిచిన పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు అని ఇక్కడ ప్రజలు భావిస్తూ వచ్చారు. ఇకపోతే తాజాగా టెక్కలి నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం వెలువడింది. కాకపోతే ఇక్కడ మొదటి నుండి కూడా ఏమాత్రం హోరాహోరీ పోరు జరగలేదు. చాలావరకు మొదటినుండి తెలుగుదేశం పార్టీ నేత అచ్చం నాయుడు లీడ్ లోనే కొనసాగాడు. ఇక అచ్చం నాయుడు కి మొత్తం 107923 ఓట్లు రాగా , వైసిపి పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ కి 73488 ఓట్లు వచ్చాయి. దానితో అచ్చం నాయుడు 34435 ఓట్ల మెజారిటీతో శ్రీనివాస్ పై గెలుపొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: