ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఈసారి వైసీపీకి కంచుకోట ఆయన కడప జిల్లాలో సైకిల్ పార్టీ పూర్తిగా హవా చూపించింది. ఇక్కడ రెండు మూడు నియోజకవర్గాలు తప్ప మిగతావన్నీ టీడీపీయే గెలుచుకుంది. ఈసారి కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి నంద్యాల వరద రాజుల రెడ్డి పోటీ చేశారు. అయితే 2009, 2014 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వరదరాజుల రెడ్డి ఈసారి మాత్రం భారీ మెజారిటీతో గెలిచే తన సత్తా చాటారు. తాజాగా ముగిసిన ఎన్నికల రిజల్ట్స్ ఒకసారి చూద్దాం.

* 2024 ఎలక్షన్ రిజల్ట్

టీడీపీ నేత నంద్యాల వరద రాజుల రెడ్డి వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డిపై 22,744 మెజార్టీతో ఘన విజయం సాధించారు. వరద రాజుల రెడ్డి 1,06,712 ఓట్లు సాధించారు. రాచమల్లు శివ 83,968 ఓట్లతో ఓడిపోయారు.

ఈ నియోజకవర్గ పరిధిలోకి ప్రొద్దుటూరు, రాజుపాలెం వంటి రెండు మండలాలు వస్తాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య    246,869. ఇందులో సగం ఓట్లు టిడిపి నేతకే పడ్డాయని చెప్పుకోవచ్చు ఈసారి టీడీపీ ఒక సునామీ సృష్టించింది. 150 సీట్లు గెలుచుకుంటామని జగన్ చెబితే, వైసీపీ 20 సీట్లు కూడా గెలుచుకోవడానికి వైసిపి కష్టపడింది కీలక నేతలందరూ దారుణంగా ఓడిపోయారు ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని ఈ తీర్పుతో స్పష్టంగా తెలిసింది. విపక్షాలు ఐక్యం కావడం, మద్యం పాలసీ, ఇసుక మాఫియాలు, అతిగా ఆకులు చేయడం ఇవన్నీ జగన్ కి కలిసి రాలేదు.

అభ్యర్థులను కూడా ఎడా పెడా మార్చేశారు. అది కూడా ఆయనకు మైనస్ అయింది. ఒక్క సంక్షేమ పథకాలు అందజేస్తే చాలు ప్రజలందరూ తమకే ఓట్లు వేస్తారనే ఒకే ఒక్క నమ్మకాన్ని ఆయన బలంగా నమ్మారు. ప్రజలు మాత్రం సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చిన డబ్బులు ఎంచక్కా తీసేసుకుని టీడీపీ కూటమికి ఓట్లు వేశారు. కొన్ని చెడులు ఉన్న ఆయన చాలా వరకు ప్రజలకు మంచే చేశారు కానీ చివరికి మంచే అతడిని ముంచేసింది. ప్రజలకు ఎంత మంచి చేస్తే అంత చెడు జరుగుతుందనే ఒక అభిప్రాయం ఇప్పుడు ఏర్పడింది. దీనిని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ముఖ్యమంత్రులు ప్రజలకు సంక్షేమ పథకాలను తగ్గించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: