భారతదేశవ్యాప్తంగా ఇండియా కూటమి హవా కొనసాగుతోంది. గత పది సంవత్సరాల తర్వాత...కాంగ్రెస్ పార్టీ పుంజుకొని... ఎక్కువ సీట్లు సాధించే దిశగా వెళుతోంది. ఇప్పటివరకు ఇండియా కూటమి... 234 సీట్లకు పైగా లీడింగ్ సంపాదించింది. అటు ఎన్డీఏ కూటమి 290 స్థానాల వద్ద కొనసాగుతోంది. అంటే ఈ లెక్కన దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోడీకి అవకాశం ఉంది.

 అయినప్పటికీ బిజెపి పార్టీ కాస్త భయపడుతోందట. ఎన్డీఏ కూటమిలో ఉన్న...పార్టీలు...బయటకు వెళ్తే..నరేంద్ర మోడీ సర్కార్ ఏర్పాటు కావడం చాలా కష్టం అవుతుంది.  అదే సమయంలో ఇండియా కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ వస్తుంది. అయితే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న... కాంగ్రెస్ అగ్ర నేతలు... ఎన్డీఏ కూటమిలో ఉన్న నేతలను కలుస్తున్నారట.

 ఎక్కువ ఎంపీలు గెలిచిన ఎన్డీఏ కూటమి పార్టీల అధినేతలతో టచ్ లోకి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ.  ఇందులో భాగంగానే...కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ను రంగంలోకి దింపారట. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగంలోకి... డీకే శివకుమార్ ను తెరపైకి తీసుకువచ్చారట. తెలుగుదేశం పార్టీ అలాగే జేడీయు పార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బి ప్లాన్ అమలు చేస్తోందని సమాచారం.

ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడుతో శివకుమార్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు ఎన్సిపి  జాతీయ అధ్యక్షుడు శరత్ కుమార్ కూడా చంద్రబాబు,  బీహార్ సీఎం నితీష్ కుమార్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వీరందరితో డీకే శివకుమార్ టచ్ లో ఉన్నారట. అయితే కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్  తో ఈ అగ్ర నేతలు చర్చలకు సిద్ధం అవుతారా? లేక ఎన్డీఏ కూటమికి సపోర్ట్ గా నిలుస్తారా...? అనేది త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక అటు ప్రభుత్వం ఏర్పాటు దిశగా నరేంద్ర మోడీ... బిజెపి ఎంపీలతో చర్చలు చేస్తున్నారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: