ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉండి జిల్లాల పునర్విభజనలో.. ఏలూరు జిల్లాలోకి వచ్చిన నియోజకవర్గం కైకలూరు. కొల్లేరు ప్రాంతంలో విస్తరించి ఉన్న కైకలూరులో గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు రాజకీయ సమీకరణలు చాలా మారిపోయాయి. నియోజకవర్గంలో కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాలు విస్తరించి ఉన్నాయి. గత ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే జ‌య‌ మంగళ వెంకటరమణ పై వైసీపీ నుంచి పోటీ చేసిన దూలం నాగేశ్వరరావు విజయం సాధించారు. చాలా సంవత్సరాల తర్వాత కైకలూరులో కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి కూటమి.. పొత్తు నేపథ్యంలో 2014లో ఇక్కడ బీజేపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.


కామినేని కమ్మ సామాజిక వర్గం నేతకాగా.. దూలం నాగేశ్వరరావు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు పోలింగ్ ప్రచార సరళి.. పోలింగ్ తర్వాత అంచనాలు, నివేదికలు చూస్తుంటే.. కామినేని కి మరోసారి అవకాశం ఇద్దామన్న వర్గాలు కొన్ని ఉన్నాయి. సీనియర్ నేత కావడంతో పాటు వివాదాలకు దూరంగా ఉండే నేత కావడంతో కొందరు కామినేని వైపు మొగ్గు చూప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జ‌య‌మంగ‌ళ‌ వెంకటరమణ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇద్దరి నేతల మధ్య గట్టి పోటీ జరిగింది. ఇద్దరికీ గెలుపు విషయంలో సమాన అవకాశాలు ఉంటాయన్న ప్రచారమే ఎక్కువగా జరిగింది.  కామినేని గెలుపు కోసం సినీ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ సైతం ప్ర‌చారం చేశారు.


ఇక ప్ర‌చారం అంతా కాస్త ట‌ఫ్ గా ఉండ‌డంతో గెలుపు విషయంలో ఎవ్వరు పూర్తిగా అంచనా వేయలేని పరిస్థితి అయితే కనిపించింది. అంత హోరాహోరీగా జరిగిన పోరులో కామినేని ఘ‌న‌విజ‌యం సాధించారు. కామినేని ఏకంగా 45273 ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇక కామినేనికి కాలం క‌లిసొస్తే మంత్రి కూడా అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: