ఇండియా వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలలో... ఊహించని విధంగా ఎన్డీఏకు సీట్లు వచ్చాయి. వాస్తవానికి 400 సీట్లు దక్కుతాయని... ఎగ్జిట్ ఫలితాలు అలాగే సర్వే సంస్థలు వెల్లడించాయి. కానీ ఆ ఎగ్జిట్ ఫలితాలు మరియు సర్వే ఫలితాలు... ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వచ్చాయి. ఇండియా వ్యాప్తంగా కేవలం 294 స్థానాలకు ఎన్డీఏ కూటమి పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.

 అటు ఇండియా కూటమి... 240 స్థానాల వరకు వచ్చేలా స్పష్టంగా రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో కేంద్రంలో... కొన్ని ప్రాంతీయ పార్టీల అవసరం కచ్చితంగా  ఉంటుంది. ఆదిశగా ఇండియా కూటమి పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే... దేశ చరిత్రలో బిజెపి నేత చరిత్ర సృష్టించాడు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి నేత శంకర్ లల్వాని సరికొత్త రికార్డు సృష్టించి... వార్తల్లో నిలిచాడు.

 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందౌరీ స్థానం నుంచి  బిజెపి నేత శంకర్ లల్వాని పది లక్షల మెజారిటీతో విజయం సాధించాడు.  10,08, 077 ఓట్ల పైచిలుకు మెజారిటీతో   అఖండ విజయాన్ని  దక్కించుకున్నాడు బిజెపి నేత శంకర్ లల్వాని. ఈ ఎంపీ స్థానం నుంచి మొదట పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది.


 పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో  ఇప్పటివరకు బిజెపి నాయకురాలు ప్రీతం ఉండే పేరుతో... అత్యధిక మెజారిటీ రికార్డు ఉండేది. ఆమె పేరుపైన 6.9 లక్షల అత్యధిక మెజారిటీ రికార్డు ఉండేది. అయితే ఆ రికార్డును శంకర్ లాల్వాని అధిగమించడం...జరిగింది. ఇక ఈ నియోజకవర్గఓ నుంచి... నోట కు రెండవ స్థానం వచ్చింది. ఈ నియోజకవర్గంలో 2.18 లక్షల ఓట్లు నోటాకు రావడం గమనార్హం. ఇక ఇంతటి విజయం నమోదు చేయడం పట్ల బిజెపి నేత శంకర్ లల్వానిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.  ప్రధాని నరేంద్ర మోడీ కూడా శంకర్ లాల్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp