ఏపీ ఎన్నికల్లో వైసీపీకి షాకింగ్ ఫలితం వచ్చింది. 3 డిజిట్స్ తో మళ్ళీ అధికారంలోకి వస్తామని జగన్ బీమా వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు వైసిపి పార్టీ ఒక్క డిజిట్ కే పరిమితం అయింది. మంత్రలు అందరూ ఓటమి పాలైయారు. 175 సీట్లలో పార్టీ కేవలం 10 ఇట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. భారతీయ చరిత్రలో ఏ సీఎం కూడా చేయని విధంగా పరిపాలన చేసిన తమకు ఇలాంటి ఘోరమైన ఓటమి రావడంతో వైఎస్‌ జగన్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. సీఎం పదవికి రాజీనామా చేశాక ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యాయని జగన్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఏం చేసినా, ఎంత చేసినా 40% ఓటు పర్సంటేజ్ ని టీడీపీ కూటమి తగ్గించలేక పోయిందని ఆయన అన్నారు.

"అమ్మ ఒడి అందుకున్న అక్కాచెల్లెళ్లు ఓట్లు ఏమయ్యాయో తెలీదు.. అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు.. మొత్తం 53 లక్షల మంది మహిళలకు అమ్మ ఒడి వేశాను. తల్లి పిల్లల ఆప్యాయత ఏమైందో తెలియలేదు అరకోటి మందు రైతన్నల ప్రేమ ఎటు పోయిందో తెలియలేదు. ఫలితాలు చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఇలాంటి ఫలితాలు వస్తాయని నేను ఊహించలేదు. మహిళలకు సంక్షేమ పథకాలు అందించాం. వారి ఓట్లు ఏమయ్యాయో తెలియదు. మొత్తం 1 కోటి 5 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందజేశాం. అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో తెలియదు. చేయూత అందుకున్న అక్క చెల్లెమ్మల ఆప్యాయత ఏమైందో.... తెలియదు!" అని అన్నారు.

"వాహన మిత్రతో డ్రైవర్లకు అండగా ఉన్నాం వారి ఆప్యాయత ఏమైందో కూడా తెలియదు. మహిళలకు ఎంతో ఆర్థిక సహాయం చేశాం సాధికారత కోసం కృషి చేశాము. ఓడిపోయిన పర్లేదు గెలిచిన వాళ్లకి అభినందనలు. గుండె ధైర్యంతో మళ్లీ లేచి వస్తా. నా జీవితం అంతా ప్రతిపక్ష పార్టీలోనే గడిపాను. ఒక ఐదు సంవత్సరాలు తప్ప! మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటూ కష్టాలు పడటానికి సిద్ధం. గెలవడానికి మళ్ళీ ట్రై చేస్తాను. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల కోసం ఎంతో మంచి చేద్దామని తాపత్రయపడ్డాం. 54 లక్షల మంది రైతున్నలకు పెట్టుబడి సాయం అందించాం. రైతన్నలకు తోడుగా రైతు భరోసా ఇచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించాం. మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం. అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలని చూశాను. అందుకే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాం. అన్ని వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చాం. వాలంటీర్ వ్యవస్థతో అన్ని పథకాలను ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాం. పెన్షన్ కూడా పెంచాం." అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: