ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి.  టిడిపి కూటమి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది ఇదే తరుణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా  జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయని అన్నారు. ఏపీ ప్రజలకు మరింతో చేయాలని తాపత్రయపడ్డాను. లక్షల మంది అక్క చెల్లెల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. గతంలో ఎప్పుడు కూడా చేయని విధంగా  ఎంతో చేశాం. అవ్వ, తాతలు ఇలా ఎందుకు చేశారో అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.  చదువుల్లో ఎప్పుడూ కూడా చూడని మార్పులు తీసుకొచ్చాం.

దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడు చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడి సాయం చేశామని తెలిపారు. ఆటోలు, టాక్సీలు నడిపే వారికి కూడా అండగా ఉంటూ, నేతన్నలకు అండగా నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా,  చిన్న చితక వ్యాపారస్తులకు తోడుగా ఉన్నానని వారి ప్రేమంతా ఏమైందని అన్నారు. రజకులకు, నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు  ఇన్ని లక్షల మందికి నేను ఎంతో మంచి చేశానని భావోద్వేగం గురయ్యారు. అమ్మ ఒడితో కోటి 53 లక్షల మందికి ఆసరాగా నిలిచామని అన్నారు. పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తీసుకురావడమే కాకుండా,  ఎంతోమంది పేద పిల్లలకు అద్భుతమైన విద్యా వ్యవస్థను తీసుకువచ్చానని అన్నారు.  గ్రామస్థాయిలో సచివాలయాలు, విద్యా వాలంటీర్లను తీసుకువచ్చి ఎలాంటి ఇబ్బందులు కడగకూడదని ఎన్నో చేశానని అన్నారు.

మహిళా సాధికారత అంటే  ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత వైసీపీది అన్నారు. ఇంత మార్పు తీసుకువచ్చిన తర్వాత కూడా తల్లులంతా ఆప్యాయత ఎలా మరిచిపోయారని భావోద్వేగానికి గురయ్యారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99% హామీలు నెరవేర్చాను,  అయినా ఓటమిపాలయ్యాను. ప్రజల తీర్పును శిరసావహిస్తున్నానని జగన్ అన్నారు. కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లకు అభినందనలు తెలియజేశారు. పార్టీ కోసం పనిచేసిన వాలంటీర్లకు స్టార్ కాంపైనర్లకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఎన్ని కుట్రలు చేసినా 40% ఓటు బ్యాంకును మాత్రం తగ్గించలేకపోయారు. ఇక్కడి నుంచే నా పోరాటాన్ని స్టార్ట్ చేసి గుండె ధైర్యంతో  నిలబడి ముందుకు వెళ్తానని పేద ప్రజలకు అండగా నిలబడతానని నా పోరాటం ఆపనని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: