ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి సారి 2014 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అందులో తెలుగు దేశం పార్టీ భారీ స్థానాలను దక్కించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వై సీ పీ పార్టీ భారీ అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని అధికారం లోకి వచ్చింది. ఇక 2024 వ సంవత్సరానికి సంబంధించిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు మే 13 వ తేదీన జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే.

మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు అనగా జూన్ 4 వ తేదీన విడుదల అవుతున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలక్షన్ సంఘం ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు మొదలు అయింది. అందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రమంతటా సజావుగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదల అయ్యాయి.

ఇక తాజాగా రాజాం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ప్రాంతం నుండి వై సీ పీ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ తాలే రాజేష్ పోటీలో ఉండగా ... కూటమి అభ్యర్థిగా కొండ్రు మురళి బరిలో ఉన్నారు. ఇక వీరిద్దరూ కూడా చాలా రోజులు ఈ నియోజకవర్గం లో భారీ ఎత్తున ప్రచారాలను చేయడం , అలాగే వీరికి ఈ ప్రాంతంలో గట్టి పట్టు ఉండడంతో వీరి మధ్య చాలా పోటీ నెలకొనే అవకాశం ఉంది అని ఇక్కడ ప్రజలు భావించారు.

కాకపోతే ఇక్కడ మొదటి నుండే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కొండ్రు మురళి తన హవా చూపిస్తూ ముందుకు సాగాడు. దానితో ఈయనకు 94385 ఓట్లు వచ్చాయి. ఇక వైసిపి పార్టీ అభ్యర్థి రాజేష్ కి 73663 ఓట్లు వచ్చాయి. దానితో మురళి 20722 ఓట్ల మెజారిటీతో రాజేష్ పై గెలుపు సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: