ఏపీ రాజకీయాలు రంజుగా మారి రోజురోజుకు ఓటర్లలో ఉత్కంఠను పెంచాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం ఏ పార్టీ కచ్చితంగా గెలుస్తుందో చెప్పలేకపోవడంతో ఏపీ ఎన్నికల ఫలితాలు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను తలపిస్తున్నాయని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంకటే గౌడ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వైసీపీ, కూటమి తరపున ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు.
 
పలమనేరు అభివృద్ధి విషయంలో వెంకటే గౌడ, అమర్నాథ్ రెడ్డి మధ్య చాలా సందర్భాల్లో మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలో పలమనేరులో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో సైతం ఈ ఇద్దరు అభ్యర్థులలో ఎవరు గెలుస్తారనే చర్చ జోరుగా జరిగింది. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వెంకటే గౌడ 31 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న పలమనేరుగా 2019లో వెంకటే గౌడ జగన్ వేవ్ వల్ల సత్తా చాటారు.
 
అయితే ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డికే అనుకూల ఫలితాలు వచ్చాయి. ఏకంగా 41,799 ఓట్ల మెజారిటీతో అమర్నాథ్ రెడ్డికి విజయం దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి విజయకేతనం ఎగరవేయగా పలమనేరుగా సైతం అదే ఫలితం రిపీట్ కావడం గమనార్హం. వైసీపీ అభ్యర్థి ఎన్ వెంకటే గౌడకు ఎన్నికల ఫలితాలకు సంబంధించి దిమ్మతిరిగే షాక్ తగిలింది.
 
పలమనేరులో కచ్చితంగా కూటమి సత్తా చాటుతుందని సర్వేల ఫలితాలు వెలువడగా ఆ ఫలితాలే ఎట్టకేలకు నిజమయ్యాయి. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గంలో తనకు అనుకూల ఫలితాలు రావడంతో ఎంతో సంతోషిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పలమనేరు కోసం గతంలో ఎంతో చేశానని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసిన జిల్లాలోనే టాప్ లో పలమనేరును నిలపాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. అమర్నాథ్ రెడ్డి విజయం టీడీపీ శ్రేణులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: