ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత వాడి వేడిగా ఎలక్షన్లు జరిగాయి. మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలకు ఎలక్షన్ లు జరిగాయి. ఇక దాదాపు ఎలక్షన్లు అన్ని ప్రాంతాల్లో చాలా సజావు గానే సాగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం చదురు మదురు సంఘటనలు జరిగాయి. ఇక వాటన్నింటినీ పోలీసులు , ఎలక్షన్ కమిషన్ దగ్గరుండి చక్కబెట్టింది.

ఇకపోతే మొదటి నుండి కూడా వైసిపి మరియు కూటమి నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పై ప్రత్యేక దృష్టిని పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం దక్కించుకోవడానికి రెండు ప్రధాన వర్గాలు భారీగానే పోటీ పడ్డాయి. ఇకపోతే మరీ ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గం లో మొదటి నుండి గట్టి పోటీనే ఉంది.

ఈ నియోజకవర్గము నుండి వైసీపీ అభ్యర్థిగా పెరియా విజయ బరిలో ఉండగా , కూటమి అభ్యర్థిగా బెందాళం అశోక్ బరిలో ఉన్నారు. ఇకపోతే వీరిద్దరూ ఎలక్షన్ల ముందు ఈ నియోజకవర్గం లో భారీ ఎత్తున ప్రచారాలను చేశారు. అలాగే జనాలను ఆకర్షించేందుకు చాలా రోజులు ఈ నియోజకవర్గాలలో గట్టిగా పని చేశారు. దానితో వీరిద్దరి మధ్య గట్టి పోటీనే ఉండబోతున్నట్లు ఎలక్షన్ల ముందు నుండే ప్రజలు అంచనా వేశారు.

ఆ అంచనాలకు తగినట్టు గానే వీరి మద్ది గట్టి పోటీ నెలకొంటుంది. ఇక మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు గాను ఈ రోజు అనగా జూన్ 4 వ తేదీన ఫలితాలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం వెలువడింది. తాజాగా విడుదల అయిన ఇచ్చాపురం ఫలితాలలో వైసిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి పీరియా విజయ పై , టిడిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి అశోక్ బెండలం గెలుపొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: