ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటు లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.అయితే ఈసారి ఎన్నికలలో జనసేన పార్టీ సంచలన విజయం సాధించింది.అధికార వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ తాను అనుకున్నది సాధించి చూపించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చెప్పిన 100 శాతం స్ట్రైక్ రేటు మాట పవన్ కల్యాణ్ నిజం చేసి చూపించారు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన 21 అసెంబ్లీ మరియు 2 పార్లమెంట్ స్థానాల్లో పవన్ కల్యాణ్ అభ్యర్థుల గెలుపు దాదాపు ఖాయం అయింది.. మొత్తానికి జనసేనాని అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ 50 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.త్వరలోనే పిఠాపురం ఎమ్మెల్యే గా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.ఇదిలా ఉంటే తాజాగా వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది.


వైనాట్ 175 అన్న వైసీపీ ఇప్పుడు కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు, వీరాభిమానులు వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు.రాష్ట్రం లో ఇంత దారుణంగా అధికారంలో వున్న పార్టీ ఓడిపోతుందని ఎవరూ కూడా ఊహించలేదు. ఎన్నికల ముందు భారీ స్థానాలతో ఎలక్షన్స్ లో విజయం సాధిస్తాము అని వైసీపీ ప్రగల్బాలు పలికింది. అయితే ఇంత దారుణమైన స్థానాలు వచ్చాయాని  వైసీపీ కలలో కూడా ఊహించి ఉండదేమో. ఈ ఓటమిపై పార్టీ నేతలు స్పందించలేని పరిస్థితి నెలకొనింది.అయితే తాజాగా వైసీపీ ఓటమిపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. ‘రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పును ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును అందరూ శిరసావహించాల్సిందే. ఓటమికి కారణాలను మేము సమీక్షించుకుంటాం అని అన్నారు. ఎక్కడ పొరపాట్లు జరిగాయో సమీక్షించుకుంటాం. త్వరలోనే రెట్టింపు ఉత్సాహంతో తిరిగివస్తాం అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: