2024 ఏపీ ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి తన వారసుడు అభినయ్ రెడ్డిని బరిలోకి దింపారు. ఆయన తిరుపతి నుంచి పోటీ చేశారు కానీ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చేతిలో ఓడిపోయారు. కొడుకు విజయం కోసం భూమన చాలానే కష్టపడ్డారు. అయితే అతడిని గెలిపించడంలో మాత్రం ఆయన ఫెయిల్ అయ్యారు. నిజానికి ఈసారి టీడీపీ కూటమి సునామీ క్రియేట్ చేసింది దీనివల్ల వైసిపి సింగిల్ డిజిట్ కే పరిమితం కావలసిన దుస్థితి ఎదురయ్యింది.
ఇకపోతే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి రాజకీయాల్లో చాలా కాలంగా యాక్టివ్ గా ఉంటూ వచ్చారు చివరికి కొడుకుని గెలిపించాలని ఎంతో తాపత్రయపడ్డారు కానీ వైసిపి అనుభయంగా ఓడిపోతుందని ఆయన అసలు ఊహించలేదు. భూమన కరుణాకర్ రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక 2004-2006 వరకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడా) చైర్మన్‌గా పని చేశారు. 2006 నుంచి 2008 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. మళ్ళీ గత ఏడాది ఆగస్టులో ఆ పదవిని చేపట్టారు.
ఇకపోతే తాజాగా జగన్ కూడా తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ప్రజలకు ఎంతో మంచి చేసిన ఓటమి పాలయ్యామని ఈ ఫలితాలు ఎంతో ఆశ్చర్యపరిచాయని ఆయన చాలా ఎమోషనల్ గా కామెంట్లు చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విజయ సాయి వంటి కీలక నేతలు కూడా దారుణంగా ఓడిపోయారు. వారు కూడా తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.