మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు అనగా జూన్ 4 వ తేదీన విడుదల అవుతున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటల నుండి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. ఇక అందు లో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన సిబ్బంది అందుకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. 

ఆ తర్వాత ఈవిఏం ఓట్లను లెక్కించడం మొదలు పెట్టింది. ఇక ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి. తాజాగా కృష్ణా జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇక పాతపట్నం నియోజకవర్గం నుండి వై సీ పీ పార్టీ అభ్యర్థిగా రెడ్డి శాంతి బరిలో ఉండగా , కూటమి నుండి మామిడి గోవిందరావు బరిలో ఉన్నారు. 

ఇక మొదటి నుండి కూడా పాతపట్నం సీటును ఎలాగైనా దక్కించుకోవాలి అని ఈ రెండు వర్గాలు గట్టిగా ఫిక్స్ అవడంతో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున కార్యకర్తలు ప్రచారాలను చేశారు. అలాగే ఈ ఇరు వర్గాల పార్టీ పెద్దలు కూడా ఈ ప్రాంతాలను పర్యటించడంతో వీరికి మరింత మైలేజ్ పెరిగింది.

దానితో ఈ ప్రాంతంలో ఎవరు గెలుస్తారు అని చెప్పడం ఇక్కడ ప్రజలకు కూడా చాలా కష్టం అయింది. ఇక వీరిద్దరి మధ్య పర్వాలేదు అనే స్థాయిలోనే పోటీ జరిగింది కానీ చివరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మామిడి గోవిందా రావు , వైసిపి పార్టీ అభ్యర్థురాలు అయినటువంటి రెడ్డి శాంతి పై గెలుపొందారు. ఇక తెలుగు దేశం అభ్యర్థి అయినటువంటి గోవింద రావు గెలవడం తో ఈ ప్రాంత టి డి పి శ్రేణులు ప్రస్తుతం సంబరాల్లో మునిగి పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap