2019 ఎన్నికలలో రాజోలు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ప్రత్యేకత ఉంది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు ఆ ఎన్నికలు ఎంతో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. పార్టీ అధినేత పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో ఆయన ఓడిపోయారు. జనసేన రాష్ట్రం మొత్తం మీద గెలిచిన ఏకైక నియోజకవర్గంగా రాజోలు రికార్డుల్లో నిలిచింది. ఇంకా చెప్పాలి అంటే జనసేన తరఫున తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యేగా గత ఎన్నికలలో ఇక్కడ నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావు రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులకే వైసీపీకి దగ్గరయ్యారు.


ఈ ఎన్నికలలో రాపాక అమలాపురం నుంచి వైసీపీ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలతో పాటు మామిడికుదురు మండలంలోని కొన్ని గ్రామాలు విస్తరించి ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గం రాజకీయంగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. అలాగే కాపులు, శెట్టిబలిజ సామాజిక వర్గాల తో పాటు ఎస్సీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఇక్కడ అభ్యర్థులు మారారు.


గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి ఓడిపోయి మూడోస్థానంతో సరిపెట్టుకున్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక జనసేన నుంచి మాజీ ఐఏఎస్ అధికారి దేవవరప్రసాద్ పోటీ చేశారు. గత ఎన్నికలలో రాష్ట్ర మొత్తం మీద జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం కావడంతో పవన్ కళ్యాణ్ గట్టిగా కాన్సన్ట్రేషన్ చేశారు. పైగా టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో రాజోలులో.. జనసేన ఘనవిజయం సాధిస్తుందన్న అంచనాలు ఉండాలి... అయితే గొల్లపల్లి చివర్లో వైసీపీలోకి వెళ్లి పోటీ చేయడంతో పాటు... ఆయ‌న సీనియ‌ర్ కావ‌డం... సానుభూతి ఉండ‌డంతో ట‌ఫ్ ఫైట్ న‌డిచింది.


ఇక గట్టి పోటీ మధ్యలో జనసేన గెలుస్తుంది అన్న ప్రచారం నడిచింది. ఈరోజు జరిగిన కౌంటింగ్ లో 39011 ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. మొత్తానికి జ‌న‌సేన మ‌రోసారి రాజోలులో జెండా ఎగ‌రేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: