ఈ గెలిచిన రోజు ఒక చారిత్రాత్మక రోజు అని ఆయన వెల్లడించారు. ఏదైతే చెప్పే అధికారంలోకి వచ్చామో అదేం తప్పనిసరిగా నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఒక జవాబుదారు ప్రభుత్వంగా పనిచేస్తామని, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు పునాధులు వేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
"ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం. ఆ చీకటి రోజులో అయిపోయాయి. ప్రతి ఒక్కరూ బాధ్యత తోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యత భుజాల మీద వేసుకొని జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ఆలోచన విధానం చేయాల్సి ఉంటుంది. వైసీపీ వైయస్ జగన్ నాకు వ్యక్తిగత శత్రువులు కాదు. ఆయనను ఇబ్బంది పెట్టడానికి మేము అధికారంలోకి రాలేదు వైసీపీ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదు. ఈ ఘనవిజయంతో ఏపీ ప్రజలకు మంచి చేయడానికి కృషి చేస్తాం." అని పవన్ కళ్యాణ్ చాలా హుందాగా మాట్లాడుకో వచ్చారు.
జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ఎవరు కూడా ఏ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడిన మాటలకు చాలామంది చప్పట్లు కొట్టారు. "దేశంలో పోటీ చేసిన ప్రతి చోటా గెలిచిన రికార్డు జనసేనదే, 21 చోట్ల పోటీ చేసి అన్నింటా విజయం సాధించడం రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం వల్లే సాధ్యమైంద"ని కూడా పవన్ తెలిపారు. ప్రస్తుతం పవన్ ప్రెస్ మీట్ ను కోట్ల మంది చూడటం విశేషం.