జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి ఒంటరి గా కాకుండా టి డి పి , బి జె పి లతో పాటు పొత్తులో భాగంగా అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల లోకి దిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం 21 అసెంబ్లీ స్థానాలను రెండు పార్లమెంటు స్థానాలను మాత్రమే తీసుకున్నాడు . అలా తక్కువ స్థానాలను తీసుకోవడం తో చాలా మంది ఎందుకు అంత తక్కువ స్థానాలు అని ఆయనను విమర్శించిన వారు కూడా ఉన్నారు.

కాకపోతే పవన్ మాత్రం వ్యూహాత్మకం గానే అంత తక్కువ సీట్ల ను తీసుకున్నట్లు ప్రస్తుతం అర్థం అవుతుంది.  జనసేన అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ 21 అసెంబ్లీ స్థానాలలో , రెండు పార్లమెంట్ స్థానాల లో అభ్యర్థులను నిల బెట్టి వాటిలో వ్యూహాత్మకంగా ప్రచారాలను చేశాడు . దానితో 100% రిజల్ట్ పవన్ కు సాధ్యం అయింది . ఆయన పార్టీ నుండి నిలుచున్న 21 అసెంబ్లీ స్థానాలలో 21 మంది గెలిచారు.

అలాగే రెండు పార్లమెంట్ స్థానాలలో రెండు పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నాడు . ఇలా భారీ విజయాన్ని అందించిన జనాలకు ఆయన థాంక్స్ చెబుతూ తాజాగా మాట్లాడారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ... నాకు ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నన్ను కేవలం పిఠాపురం ప్రజలు గెలిపించలేదు. ఆంధ్ర లోని ఐదు కోట్ల మంది జనాలు నన్ను గెలిపించారు. ఈ విజయంతో  ఏ మాత్రం గర్వం రాదు. ఈ గెలుపు వైసిపి పార్టీపై , ఆ పార్టీకి చెందిన నాయకులపై కక్ష సాధింపు చర్యల కోసం ఏ మాత్రం కాదు. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: