చిత్తూరు లోక్ సభ పరిధిలో పోటాపోటీగా ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలలో చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటి. తాను చేసిన సేవా కార్యక్రమాలు విజయానందరెడ్డికి ప్లస్ కాగా మూడు పార్టీల కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం గురజాల జగన్ మోహన్ కు కలిసొచ్చింది. తాను చేసిన అన్నదాన కార్యక్రమాలు, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు ప్లస్ అవుతాయని విజయానందరెడ్డి భావించగా హేమాహేమీల మధ్య పోరు నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది.
అయితే ఏపీలో కూటమి వేవ్ నేపథ్యంలో చిత్తూరు ఎమ్మెల్యేగా గురజాల జగన్ మోహన్ కే అనుకూల ఫలితాలు వచ్చాయి. నియోజకవర్గంలో ఏకంగా 13400 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించి వార్తల్లో నిలికారు. ఆర్వో శ్రీనివాసులు నుంచి డిక్లరేషన్ పత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అందుకోవడం జరిగింది. గురజాల జగన్ మోహన్ కు కూటమి తరపున పోటీ చేయడంతో లక్ కలిసొచ్చింది.
సులువుగానే చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆయన విజయం సాధించడం జరిగింది. చిత్తూరు ఎమ్మెల్యేగా గురజాల జగన్ మోహన్ గెలవడంతో పాటు విజయానందరెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించారు. నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదురైనా వ్యూహ, ప్రతి వ్యూహాలతో తెలివిగా అడుగులు వేసి గురజాల జగన్ మోహన్ విజయాన్ని అందుకున్నారు. చిత్తూరులో టీడీపీ జెండా ఎగురవేసి గురజాల జగన్ మోహన్ వార్తల్లో నిలిచారు. చిత్తూరులో అనుకూల ఫలితాలు రావడంతో గురజాల జగన్ మోహన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.