ఇక్కడ నాలుగు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత తెల్లం బాలరాజును కాదని.. ఆయన స్థానంలో ఆయన భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తెల్లం రాజ్యలక్ష్మికి వైసీపీ అవకాశం ఇచ్చింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అవకాశం ఇచ్చిన ఏకైక మహిళ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్యలక్ష్మి కావటం విశేషం. ఇక కూటమి పొత్తులో భాగంగా పోలవరం స్థానాన్ని జనసేనకు కేటాయించారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి కేవలం 13 వేల ఓట్ల తెచ్చుకున్న చిర్రి బాలరాజుకు ఇక్కడ అవకాశం దక్కింది.
అయితే ఎన్నికల ప్రచారానికి ముందు నుంచి ఈ సీటు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం జరిగినప్పటి నుంచి కచ్చితంగా ఇది వైసీపీ ఖాతాలోకే అన్న ప్రచారం ఎక్కువగా వినిపించింది. పలు సర్వేలు.. నివేదికలు అంచనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా జనసేనకు ఎంతవరకు ? సహకరిస్తుంది అన్న సందేహాలు కూడా పోలవరంలో గట్టిగా నడిచాయి. ఈ రోజు కౌంటింగ్‌లో జనసేన బాలరాజు బ్లాక్‌బస్టర్ కొట్టి పడేశాడు. ఏకంగా ఓడిపోతుందనుకున్న సీటులో 7935 సీట్ల మెజార్టీతో గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. అలా ప్రతిష్టాత్మక పోలవరం సీటు జనసే న ఖాతాలో పడింది.