పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు, ఇటు పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు అయిన పుట్టా మహేష్ కుమార్ ను రంగంలోకి దించింది. వాస్తవంగా చూస్తే మహేష్ కుమార్ నియోజకవర్గానికి జిల్లాకు నాన్ లోకల్. ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి. టిక్కెట్ ఖరారు అయ్యాక నియోజకవర్గంలో అడుగుపెట్టిన మహేష్ కుమార్ కేవలం ఆర్థిక, అంగబలం, పార్టీ బలం చూసుకుని రంగంలోకి దిగారు. పార్లమెంటు పరిధిలో చింతలపూడి ఎస్సీ, పోలవరం ఎస్టి రిజర్వ్ నియోజకవర్గాలతో పాటు నూజివీడు, కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు జనరల్ స్థానాలు ఉన్నాయి.
ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేతలు అయినా ఎందుకో కానీ ఏలూరు పార్లమెంట్లో సాధారణ జనంకు కూడా కడప జిల్లాకు చెందిన వ్యక్తిని ఇక్కడ టీడీపీ పోటీలో పెట్టటం పెద్దగా ఇష్టపడలేదు. అందుకే ముందు నుంచి మహేష్ గెలుపుపై తీవ్రమైన ఉత్కంఠ ఏర్పడింది. పార్లమెంటు పరిధిలో దెందులూరు, నూజివీడు, కైకలూరు, పోలవరం, చింతలపూడి ఐదు సెగ్మెంట్లో నువ్వా నేనా అన్నట్టుగా పోరు జరగడంతో ఏలూరు పార్లమెంటుపై ఏ పార్టీ జెండా ఎగురుతుంది అన్నది చివరి వరకు అంతుపట్టలేదు. ఈరోజు జరిగిన కౌంటింగ్ లో మహేష్ యాదవ్ 1.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా కౌంటింగ్ పూర్త వ్వకుండానే భారీ మెజార్టీ వచ్చేసింది. ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది.