ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఫలితాలు వెలువడుతున్నాయి.ఊహించని స్థాయిలో కూటమి 175 సీట్లకు గాను 160 కి పైగా విజయం సాధించి సంచలనం సృష్టించింది. గతంలో 151 సీట్లు సాధించి సంచలనం సృష్టించిన వైసీపీ కేవలం 10 సీట్లతోనే సరిపెట్టుకోవడం జరిగింది. చరిత్రంలో వైసీపీ కనీ విని ఎరుగని ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి వైసీపీ వర్గాల వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. వైసీపీ మంత్రులు అందరూ కూడా ఘోరంగా ఓటమి చెందారు. రాష్ట్రంలో వైసీపీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది.. జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో 70 వేల భారీ మెజారిటీతో గెలిచాడు..అలాగే జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన 21 నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులు విజయం సాధించారు.అలాగే ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులు కూడా విజయం సాధించారు. రాష్ట్రమంతా కూటమి భారీ విజయం సాధించింది. అయితే రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించారు. కూటమి నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది..

నెల్లూరు గూడూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ 19915 ఓట్ల మెజారిటితో గెలిచాడు..నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది 15999 మెజార్టీతొ విజయం సాధించారు ..అలాగే కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతి రెడ్ది 49996 మెజార్టీతొ విజయం సాధించారు ...నెల్లూరు ఆత్మకూరు నియోజకవర్గంలో అనం రామనారాయణ రెడ్ది 7106 మెజార్టీతొ విజయం సాధించారు. నెల్లూరు రూరల్ జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది 31971 మెజార్టీతొ హ్యాట్రిక్ విజయం సాధించారు.అలాగే వేంకటగిరి నియోజకవర్గంలో కురుగొండ్ల రామకృష్ణ 15454 మెజార్టీతొ విజయం సాధించారు.సూళ్లూరుపేట డాక్టర్ నెలవల విజయ శ్రీ 29115 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.నెల్లూరు నగరం నియోజకవర్గంలో ఒంగురు నారాయణ నుండి 70513 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.అలాగే కావలి నియోజకవర్గంలో దగ్గుమాటి వెంకటకృష్ణా రెడ్ది 29700 ఓట్ల మెజార్టీతో విజయం..ఉదయగిరి నియోజకవర్గంలో 9566 ఓట్ల మెజార్టీతో కాకర్ల సురేష్ విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: