పార్లమెంట్ ఎన్నికల్లో... చాలా విభిన్నమైన ఫలితాలు చోటు చేసుకున్నాయి. సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు ఎన్నికల్లో మెరువగా కొంతమంది విజయం సాధిస్తే కొంత మంది అపజయం పాలయ్యారు. అయితే క్రీడారంగం నుంచి పోటీ చేసిన యూసఫ్ పటాన్.... అఖండ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తొలిసారిగా పార్లమెంట్ బరిలో దిగిన యూసఫ్ పఠాన్.... పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపీగా గెలుపొందాడు.

 మూడుసార్లు ఎంపీగా గెలిచిన అధర్రంజన్ అనే వ్యక్తి పై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు యూసఫ్ పటాన్. బరంపూర్ నుంచి... 1999  నుంచి ఎంపీగా అధీర్ రంజన్ పనిచేస్తున్నాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కడా కూడా ఓడిపోలేదు అధిర్ రంజన్. అంతేకాదు... ప్రస్తుతo పశ్చిమబెంగాల్ పిసిసి అధ్యక్షులుగా అధీర్ రంజన్  పని చేస్తున్న సంగతి తెలిసిందే.

 అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న అధీర్  ఎంపీగా పోటీ చేసి తొలిసారిగా విజయం సాధించాడు టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్. 2019 పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి పార్టీ తరఫున...  టీమిండియా మాజీ క్రికెటర్... గౌతమ్ గంభీర్  పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి గౌతమ్ గంభీర్ ఎంపీగా పోటీ చేయకుండా క్రికెట్ లోకి వెళ్లిపోయాడు.

 తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈసారి యూసఫ్ పటాన్ బరిలోకి దిగి విజయం సాధించాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ పార్లమెంటు స్థానాలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 29 స్థానాలలో విజయం సాధించింది. అటు భారతీయ జనతా పార్టీ కేవలం 12  స్థానాలకే పరిమితం అయింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఎక్కువ సీట్లు గెలవగా ఈసారి ఆ సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఇది ఇలా ఉండగా దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి 292 స్థానాలు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చేలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లెక్కన దేశంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: