జగన్ ఆంధ్రప్రదేశ్ లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అసలు ఇలాంటి రిజల్ట్ వస్తుందని టిడిపి కూటమి వాళ్ళు కూడా ఊహించలేదు అనుకోండి. మరి జగన్ ఇంతలా పతనం కావడానికి కారణం  ఏమిటి.. ప్రజలు జగన్ ను ఎందుకు తిరస్కరించారు. తోబుట్టువుల కన్నీటి ఉసురు జగన్ కు తగిలిందా.. ఆ వివరాలు చూద్దాం.. సాధారణంగా ఏ కుటుంబంలో అయిన తోబుట్టువులు అన్నాతమ్ముల మేలుకోరుతారు. నువ్వు తోబుట్టుకు కారం వెతుకులతో తిండి పెట్టిన  నా అన్నా తమ్ముళ్లు కలకాలం హ్యాపీగా జీవించాలని, వారు ఎదగాలనే కోరుకుంటారట. అలా తోబుట్టు ఎంత సంతోషంగా దీవిస్తే   వారి కుటుంబం కూడా అంతా ఆనందంగా ఉంటుంది.

 ఆడపిల్లలను కుటుంబాల్లో లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. అలాంటి ఆడ పిల్లలను ఇబ్బంది పెట్టి చరిత్రలో  నిలబడ్డ వారు లేరు.  కానీ జగన్ సొంత చెల్లెళ్ల కన్నీటికి కారణమయ్యాడు. తన పతనానికి తానే కారకుడు అయ్యాడని చెప్పవచ్చు. ఎన్నికల్లో  కాంగ్రెస్ గెలవలేదు, సునీత గెలవలేదు కానీ,  వారి ఇంపాక్ట్ మాత్రం రాష్ట్రమంతా జగన్ పై పడింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా సునీత వాళ్ళ నాన్నకి న్యాయం జరగలేదని నా అన్నని ఓడించమని పిలుపు బాగా పనిచేసింది.

ఈ విధంగా సొంత కుటుంబంలోని సొంత చెల్లెళ్లు అన్నను ఓడించండి అన్నారంటే రాష్ట్రవ్యాప్తంగా మహిళల మీద చాలా ప్రభావం చూపింది. వారు కొంగు చాచి తమకు అధికారం ఇవ్వమని అడగలేదు, కానీ అన్నను ఓడించమని అడిగారు దీంతో చంద్రబాబుకు చాలా ప్లస్ అయిపోయింది. అలాగే షర్మిలను ఆస్తి పరంగా జగన్ అన్యాయం చేశారని,   ముఖ్యంగా సొంత చెల్లె ఉసురు పోసు కున్నాడనే వాదన విని పించింది ఆమె తన అన్న చేసే పనులకు కన్నీరు కూడా పెట్టుకుంది. ఈ విధంగా తోబుట్టువుల ఉసురు తగిలే జగన్ ఓడిపోయారని కొంతమంది  భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: