కక్ష సాధింపు చర్యలకు దిగబోమని స్పష్టం చేశారు. అయితే నిన్న మాట్లాడని చంద్రబాబు ఈరోజు మాట్లాడారు. తాజాగా ఆయన "అవినీతి, అహంకారాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరు." అని అన్నారు. 'జగన్ ది అవినీతి పాలన, ఆయనది అహంకార ధోరణి. వీటిని ప్రజలు క్షమించలేదు. అందుకే తామే ఈసారి గెలిచాం.' అని అర్థం వచ్చేలాగా చంద్రబాబు మాట్లాడారు. జగన్ ఎమ్మెల్యే లతో ఎంపీలతో ఎప్పుడు కూడా మాట్లాడలేదని తనని చూసే ప్రజలు ఓటు వేస్తారని భ్రమలో ఉన్నారని గతంలో విమర్శలు వచ్చాయి. జగన్ కింద ఉన్న చాలామంది నేతలు ఇసుక, ల్యాండ్ మాఫియాలకు పాల్పడ్డారు. ఈ రెండు విషయాలను ఉద్దేశించి చంద్రబాబు కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద చంద్రబాబు దాదాపు 75 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రిగా గెలిచి ఆంధ్ర ప్రజలకు తన కంటే బెస్ట్ సీఎం మరొకరు ఉండరని నిరూపించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అనూహ్యంగా 21 సీట్లను గెలుచుకొని అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సినిమా ఇండస్ట్రీపై పెట్టిన రూల్స్, కఠిన ఆంక్షలు కూడా తొలగిపోతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జనసేన నాయకత్వంలోనే ఏపీ బాగుంటుందని భావిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగోగుల కోసం పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.