బర్రెలక్క అలియాస్ శిరీష గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఆమె మొదట సెన్సేషన్ గా అవతరించిన సంగతి అందరికీ తెలిసిందే. డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన బర్రెలక్క ఉద్యోగం రాకపోవడంతో బర్రెలను కాసుకుంటున్నానని మొదట ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో కాస్త వైరల్ అయింది. దాంతో అనూహ్యంగా ఆమెకి ప్రజలనుండి, ముఖ్యంగా నిరుద్యోగ యువతనుండి మంచి మద్దతు లభించింది. కట్ చేస్తే ఒక సామాన్య పేద కుటుంబానికి చెందిన బర్రెలక్క 2013లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించింది. దాంతో ఆమె టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

అప్పట్లో బర్రెలక్క తరపున జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం చేసి ఆమెకి మరింత మద్దతు ప్రకటించారు. తరువాత ఆమెకు ఐదు వేలకు పైగా ఓట్లు రావడం కొసమెరుపు. కాగా ఇటీవల పెద్దలు నిశ్చయించిన బంధువుల అబ్బాయితో ఆమె వివాహం చాలా హాట్టహాసంగా జరిగింది. పెళ్లి జరిగిన నేపథ్యంలో ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారని అందరూ భావించారు. కానీ మరోసారి ఆమె ఎన్నికల బరిలో దిగి అందరికీ షాక్ ఇచ్చారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. దాంతో ఈ న్యూస్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలో ఆమె యువత తరుపున ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహిస్తూ యువత కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని సందేశం బలంగా పంపింది. కానీ ఈసారి నాగర్‌ కర్నూల్ ఎంపీగా పోటీ చేసిన శిరీష (బర్రెలక్క) పోటీ ఇవ్వకుండానే ఓడిపోవడం చాలా బాధాకరం. నోటాకు 4,580 ఓట్లు రాగా, బర్రెలక్కకు 3,087 ఓట్లు మాత్రమే వచ్చాయి. అవును, నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఆమెకి రాకపోవడం వలన ఆమె, ఆమె అభిమానులు తీవ్రమైన నైరాశ్యంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: