•ప్యాకేజీ స్టార్ అంటూ ఎగతాళి చేసినా ఇప్పుడు సూపర్ స్టార్ గా నిలిచారు..
•కూటమి గెలుపులో పవనే ప్రధానం..
(ఆంధ్ర ప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా తన పవర్ ఏంటో చూపించి సత్తా చాటారు.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అసలైన నాయకుడు.. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే వచ్చారు.. తప్పదనుకున్న ప్రతిసారి కూడా తలవంచి తగ్గుతూ వచ్చాడు.. ముఖ్యంగా వైసీపీ నేతలు టార్గెట్ చేసి వ్యక్తిగతంగా దూషిస్తున్నా సరే తలవంచుకున్నారే కానీ ఆవేశానికి పోలేదు.. ముఖ్యంగా బండ బూతులు తిట్టినా.. వ్యక్తిత్వ ఖననం చేసినా.. ఓర్చుకున్నాడు.. ప్యాకేజి స్టార్ అంటూ ఎగతాళి చేసినా తట్టుకున్నాడు.. ఓర్చుకున్నాడు.. తాను పెట్టుకున్న గీతను ఏ రోజు దాటలేదు. పార్టీల జెండాలు, పర్సనల్ ఎజెండాలు పక్కనపెట్టి కూటమి గెలుపుకు బాటలు వేశాడు..
ప్రజలకు అన్యాయం చేసిన ప్రతి చోట ఎదిరిస్తూ వచ్చాడు. జగన్ ను నిలదీయడంలో ఎక్కడ కూడా రాజీపడలేదు.. అన్యాయాన్ని నిలదీస్తూ దౌర్జన్యాలను ఎదిరిస్తూ జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ .. ఈ నేపథ్యంలోనే జనం కోసం జగన్ వ్యతిరేక శక్తులను ఏకతాటి మీదకు తీసుకొచ్చి వై నాట్ 175 అంటున్న వైసీపీ లెక్కలను తారుమారు చేసి ఓట్లు చీలకుండా అన్ని కూటమికే పడేలా ప్లాన్ చేసి ఈసారి కూటమి ఎన్నికల ఫలితాలలో ప్రథమంగా నిలిచారు పవన్ కళ్యాణ్.. ఈయన ఊహాత్మక రచన వల్లే కూటమి ఈ రేంజ్ లో గెలుపొందిందని వార్తలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా 21 స్థానాల్లో పోటీ చేయగా 21 స్థానాల్లో కూడా గెలుపొంది.. 100% రిజల్ట్ తో రికార్డు సృష్టించారు.
ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని విపక్షాలను కూడా ఏకం చేసిన పవన్ కళ్యాణ్ పర్సనల్గా ఎటాక్ చేసింది వైసిపి. ప్రతిరోజు కూడా తిట్టను తిట్టు తిట్టకుండా ముప్పేట దాడి చేయించింది.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు వ్యక్తిగతంగా హేళన చేసింది. ఇక సినిమాల్లో హీరో వేషాలు వేస్తూ రాజకీయాల్లో జీరో క్యారెక్టర్ అంటూ ఆయన ఆత్మ అభిమానాన్ని కూడా కించపరిచింది. అయినా సరే ఎక్కడ తగ్గకుండా పంతాలకు పోకుండా అనుకున్నది సాధించి జగన్ ను గద్దె దించారు. ఇక తలవంచిన ప్రతిసారి ఆవేశాన్ని మూటగట్టుకొని ఇప్పుడు రెట్టింపు వేగంతో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్..