ఆసంగతి పక్కన బెడితే, ఇపుడు సర్వత్రా టీడీపీ & కూటమి శ్రేణుల్లో ఒక్కటే ప్రశ్న మెదులుతోంది. అదే మంత్రుల పదవుల గురించి. అవును, టీడీపీ కేడర్ కి ఇపుడు మంత్రుల్ని డిసైడ్ చేయడం ఒకింత కత్తిమీద సాములాంటి పనే. దాదాపు గెలిచిన అభ్యర్థులందరూ 50 వేలకు పైచిలుకు మెజారిటీ పొందినవారు కావడం కొసమెరుపు. పైగా అందులో సీనియర్ల సంఖ్య కూడా పెద్దదిగానే ఉంది. మరోవైపు కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం అయినటువంటి జనసేన కేడర్ కి కూడా అదేస్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కాబట్టి ఈ మంత్రివర్గ నియమం అనేది బాబుకి ఒకింత కష్టంగా మరీ అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్న మాట.
ఇకపోతే జాతీయ మీడియా కథనాల ప్రకారం… బాబు ఎన్డీయే కూటమిలో భాగంగా కనీసం 7 కేంద్ర మంత్రిత్వ శాఖలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జోరుగా జరుగుతోంది. కీలకమైన రోడ్లు, గ్రామీణాభివృద్ధి వంటి మంత్రిత్వ శాఖలను చంద్రబాబు టీడీపీకి ఇవ్వాలని కోరుతున్నట్టుగా సమాచారం. మరోవైపు బీజేపీకి అవసరం కాబట్టి… మంచి శాఖలే ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషణలు జరుగుతున్నాయి. అంతేకాకుండా లోక్ సభలో స్పీకర్ పోస్టును కూడా టీడీపీ కోరుతుందని, జలవనరుల శాఖపై కూడా టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉందని, సాయంత్రం ఎన్డీయే మీటింగ్ తర్వాత క్లారిటీ వస్తుందని జాతీయ మీడియా కథనం.