ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ దారుణ పరాజయం ఆ పార్టీ నేతలను ఎంతో బాధ పెడుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు ప్రస్తుతం ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునే పనిలో పడ్డారు. వైసీపీ నేత జక్కంపుడి రాజా వైసీపీకి ఇలాంటి దుస్థితి రావడానికి ధనుంజయరెడ్డి అనే అధికారి అని చెప్పారు. ధనుంజయ రెడ్డి ఒక పనికిమాలిన చెత్త అధికారి అని ఆయన చుట్టూ ఎమ్మెల్యేలు ప్రదక్షిణలు చేసినా పనులు జరగకుండా అడ్డుకున్నారని జక్కంపూడి రాజా చెప్పుకొచ్చారు.
 
ధనుంజయ రెడ్డి ఉపాధి హామీ పనులకు సైతం బిల్లులు చెలించకుండా ఇబ్బందులు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. మంచి చేసి ఉంటే మాత్రమే ఓటు వేయమని అడిగే దమ్మున్న నాయకుడు జగన్ అని జక్కంపూడి రాజా చెప్పుకొచ్చారు. దేశంలో ఏ సీఎంకు అయినా ఇలా చెప్పే దమ్ముందా అని ఆయన రివర్స్ లో ప్రశ్నించారు. గెలిచినా ఓడినా జగన్ రియల్ హీరో అని జక్కంపూడి రాజా కామెంట్లు చేశారు.
 
వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ధనుంజయరెడ్డి అనే అధికారి కారణమని జక్కంపూడి రాజా కామెంట్లతో క్లారిటీ వచ్చేసింది. గత ఐదేళ్లలో తాను రాజానగరం మండల కేంద్రం ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలను చేశానని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఏదేమైనా ప్రజల కోసం పని చేస్తామని ఆయన వెల్లడించడం గమనార్హం. వైఎస్సార్ కుటుంబంతోనే కలిసి నడుస్తామని ఆయన పేర్కొన్నారు.
 
ముద్రగడ పద్మనాభం కాపుల రిజర్వేషన్ల కోసం ఎంతో కష్టపడ్డారని అలాంటి నేత ఎన్నో మాటలు పడాల్సి వచ్చిందని జక్కంపూడి రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాపుల కష్టాలను ఏనాడు పట్టించుకోని నాయకులు హీరోలు అయిపోయారంటూ పవన్ కళ్యాణ్ గురించి ఆయన విమర్శలు చేశారు. జక్కంపూడి రాజా చేసిన కామెంట్లతో వైసీపీ అభిమానులు సైతం ఏకీభివిస్తున్నారు. జక్కంపూడి రాజా కామెంట్ల విషయంలో జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: