ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. మరీ ఇంత తక్కువ సీట్లు వస్తాయని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే జగన్ గడిచిన ఐదేళ్లలో మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, వాహనాల డ్రైవర్లకు, చిరు వ్యాపారులకు ఎంతో ఆర్థిక సహాయం చేశారు. చంద్రబాబు కంటే ఎక్కువగానే ఉద్యోగాలను అందించారు. బాబు కంటే ప్రజలను బాగానే చూసుకున్నారు కానీ ఓడిపోయారు. అందువల్ల ఆయన ఓడిపోవడం అందరికీ ఒక షాక్‌లాగా తగిలింది.

అయితే జగన్ ఓడిపోవడానికి కొన్ని కారణాలను చాలామంది వినిపిస్తున్నారు. ముఖ్యంగా నలుగురు కారణమని కూడా చెబుతున్నారు. ఆ నలుగురు వెన్నుపోటు పొడవడం వల్లే ఈరోజు ఇంత అవమానకర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అందులో మొదటి వారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు అని చెప్పవచ్చు. ఎందుకంటే జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ వేరే కులల వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఇది రెడ్డి కులం వారికి నచ్చలేదు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా రెడ్ల కులానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారికి ఇంపార్టెన్స్ ఇచ్చారు జగన్. విజేత వారు ఈసారి జగన్‌కు ఓటు వేయలేదట. కాని సొంత కులం వాడిని ఓడించి తమకు అధికారమే లేకుండా చేసుకుంటున్నామనే కామెంట్ సెన్స్ వారికి లేకుండా పోయింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లు కూడా జగన్‌కి వెన్నుపోటు పొడిచారు. జగన్ లాగా ఏ అగ్రకుల నేత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినా కూడా ఈ కులాలు వాళ్లు జగన్‌ను అర్థం చేసుకోలేదు. తమ మంచి కోసం ఒక నేత కృషి చేస్తున్నారనే కామన్ సెన్స్ లేకుండా కూటమికి ఓట్లు గుద్దేశారు. ఈ కులాల వారు ఒక పది రూపాయలు వేరే వ్యక్తి ఎక్కువ ఇస్తున్నారంటే చాలు అటువైపే మొగ్గు చూపుతారు. చంద్రబాబు పెన్షన్ పెంచుతా అన్నారు, ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ అన్నారు. ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. జగన్ కంటే ఎక్కువ ఇచ్చేస్తారు కదా అని చంద్రబాబు వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీలు మళ్లారు. దీనికి వారిని నిందించాల్సిన అవసరం లేదు, పేదరికం వల్ల ఆలోచన అలా తయారై ఉండొచ్చు. కానీ ఈ క్రమంలో వారు వెన్నుపోటు పొడిచేశారు.

పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్, యూనిఫామ్‌లు, బూట్లు ఇస్తూ జగన్ వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే మహోత్తరమైన కార్యక్రమాలను చేపట్టారు కానీ వీళ్లు దానిని అర్థం చేసుకునేంత ఆలోచన చేయలేదు. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తానన్న జగన్ కంటే క్వాలిటీ లిక్కర్ తెస్తానన్న చంద్రబాబే వారికి బాగా నచ్చారు. క్వాలిటీ కోటర్ కోసం వీళ్లు జగన్ లాంటి ఒక మంచి విద్యా సంస్కర్తకు వెన్నుపోటు పొడవడం నిజంగా విచారకరం.

 ఇక ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న మోదీ, చంద్రబాబుకు ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేయడం నిజంగా సిగ్గుచేటు. జగన్ కొత్తగా చాలా ప్రభుత్వ ఉద్యోగాలను అందజేశారు. కూటమికి ఓటు వేయడం వెన్నుపోటుగా పరిగణించాల్సిందే. మోఢీ రిజర్వేషన్లు తీసేసి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయవచ్చు. అలాంటి వ్యక్తి కలిసి ఉన్న టీడీపీకి ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేయడాన్ని బట్టి చూస్తుంటే వారికి కామన్ సెన్స్ లేదని అర్థమవుతోంది. వీరి తప్పుల వల్ల రేపొద్దున పిల్లలందరూ ప్రైవేట్ జాబ్స్ లో మగ్గిపోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: