ఏపీలో వైసీపీ దారుణ పరాజయానికి కారణాలు ఏంటనే ప్రశ్నకు షాకింగ్ కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ నమ్ముకున్న సామాజిక వర్గాల ఓటర్లే ఆయనకు గట్టి దెబ్బ వేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలోని మెజారిటీ సీట్లలో సత్తా చాటుతామని వైసీపీ భావించగా ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది. ఆ వర్గాల ఓటర్ల దెబ్బ జగన్ పై గట్టిగా పడిందని కామెంట్లు వ్యక్తమావుతున్నాయి.
 
కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో 39 సంవత్సరాల తర్వాత టీడీపీ జెండా ఎగిరిందంటే ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీపై ఎంత వ్యతిరేకతతో జరిగాయో అర్థమవుతుంది. రూరల్ ఓటర్లు సైతం జగన్ కంటే చంద్రబాబుకే అనుకూలంగా వ్యవహరించడం కొసమెరుపు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వైసీపీకి వచ్చాయి. 29 ఎస్సీ నియోజకవర్గాల్లో కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది.
 
7 ఎస్టీ నియోజకవర్గాల్లో సైతం 2 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భారీస్థాయిలో పాజిటివ్ ఫలితాలు సాధిస్తామని భావించిన జగన్ కు ఈ ఫలితాలు షాకిచ్చాయి. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ఓటర్లు సైతం జగన్ ను నమ్మడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ అమలు చేసిన కొన్ని పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయమని చెప్పవచ్చు.
 
వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ కూడా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి. వేర్వేరు కారణాలు వైసీపీ ఓటమికి కారణమయ్యాయి. ఏపీలో వైసీపీకి పూర్వ వైభవం రావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరి జగన్ భవిష్యత్తులో ఏం చేస్తారో చూడాల్సి ఉంది. జగన్ వైసీపీని మూసేయడం బెటర్ అని కొంతమంది విశ్లేషకులు వెటకారంగా కామెంట్లు చేస్తున్నారంటే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏంటో సులువుగా అర్థమవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ ఈ ఓటమి నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: