ఆంధ్రాలో ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం వహిస్తూ ఎదురులేని మహారాజులుగా ఫీలైపోయిన వైసీపీ నాయకులకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో సరియైన బుద్ధి చెప్పారు. పవర్ ఉన్నంత వరకే మీరు లీడర్లు, మా చేతికి ఒక్కసారి ఓటు అనే ఆయుధం ఇస్తే మీ తలరాతలు తల్లకిందులు చేస్తామని ఆంధ్రా ఓటర్లు మరోసారి నిరూపించారు. అవును, ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని నియోజక వర్గాల్లో వైసీపీని మోకాళ్ళ కింద కూర్చోబెట్టారు ఓటర్లు. దాంతో వైసీపీ నాయకుల కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి... ఇంకా వారు తేరుకొని పరిస్థితి నెలకొంది అంటే అతిశయోక్తి కాదేమో!

ఇక వైసీపీలో నాలుగైదు జిల్లాలో బలమైన నాయకుడిగా చలామణి అవుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి పుంగనూరు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. విజయం వరించినప్పటికీ అది విజయమో లేదా హెచ్చరికో తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గెలుపుపై అక్కడ మెజారిటీ ఊహించారు. అయితే ఓట్ల లెక్కింపు సందర్బంగా రౌండ్ రౌండ్ కీ పెద్దిరెడ్డి వర్గానికి జనాలు ఝలక్ ఇచ్చినట్లయింది. దాదాపు 6వ రౌండ్ పూర్తి అయ్యే సరికి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి 33, 389 ఓట్లు వస్తే, టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డి (చల్లా బాబు)కు 30, 700 ఓట్లు వచ్చాయి. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి చల్లా రామచంద్రా రెడ్డి గట్టిపోటీ ఇవ్వడంతో ఆ విషయాన్ని పెద్దిరెడ్డి వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు.

అయితే కడకు కేవలం 6,095 ఓట్ల మెజారిటీతో బతికిబట్టకట్టగలిగాడు పెద్దిరెడ్డి. అది కూడా రౌడీయిజం పేరుతో సాధించిన ఓట్లేనని జనాలకి తెలియంది కాదు. ఎందుకంటే పెద్దిరెడ్డి అరాచకాలు గురించి అందరికీ తెలిసినదే. విపక్షాలని అత్యంత దారుణంగా భయపెట్టి, బెదిరించి, అవసరమైతే హింసించి తన ఈగోని చల్లార్చుకొనే పెద్దిరెడ్డి నీచ సంస్కృతి గురించి అందరికీ తెలిసినదే. అయితే ఈసారి రాష్ట్ర ప్రజలు కూటమికి విజయం పట్టం కట్టడంతో పెద్దిరెడ్డి బేస్ కదులుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ముందేం జరుగుతుందో అని ఇప్పటినుండే హడలెత్తిపుతున్నారట పెద్దిరెడ్డి వర్గీయులు!

మరింత సమాచారం తెలుసుకోండి: