ఏపీలో కౌంటింగ్ ముగిసింది. తెలుగుదేశం కూటమి అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. తెలుగుదేశంకు వచ్చిన సీట్లను చూస్తే మాత్రం  వైసీపీకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత దారుణంగా ఓటమి వస్తుందని వారు కూడా ఊహించి ఉండలేదు. కానీ వైసీపీ నేతలు చాలామంది ఏదో జరిగి ఉంటుందని అనుమాన పడుతున్నారట. అలాంటి ఈ తరుణంలో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి. జగన్ ఓటమిలో అనేక మ్యాజిక్స్ జరిగాయి అంటూ అంటున్నారు. ఆ మ్యాజిక్స్ ఏంటి అనే వివరాలు చూద్దాం.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. చాలా నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో 40% వైసీపీకి వస్తే 60% టిడిపికి ఓట్లు వచ్చాయి.

 ఈ లెక్కన చూస్తే మాత్రం ఉద్యోగులే 40% సపోర్ట్ చేసినప్పుడు జనాల సపోర్టు లేదని మనం ఎలా అనుకుంటాం. తప్పనిసరిగా జనాలు ఓటేశారు. ఏదో జరిగిందనేది వైసిపి నాయకులు గమనించాలి. వైసీపీకి సపోర్ట్ చేసిన ఉద్యోగుల ఓటింగ్ శాతం కంటే  మరిన్ని తక్కువ ఓట్లు వైసిపికి పడ్డాయి. దీన్ని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తోంది ఏదో మ్యాజిక్ జరిగిందనిపిస్తోందట. ఇక తిరుపతి ఎంపీ స్థానంలో వైసీపీ పార్టీ గెలిచింది. కానీ ఆ పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క అసెంబ్లీ కూడా వైసిపి ఖాతాలో పడలేదు. తిరుపతి పార్లమెంటు వైసీపీ అభ్యర్థికి 66వేల మెజారిటీ వచ్చింది. అసెంబ్లీలో పోటీ చేసిన టిడిపి అభ్యర్థులకు వేల మెజారిటీ వచ్చాయి. వారి మెజారిటీ ప్రకారం చూస్తే మాత్రం తిరుపతి ఎంపీ స్థానం లో వైసిపి దాదాపు 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవాలి. కానీ మెజారిటీ వచ్చింది. ఇలా మాట్లాడితే క్రాస్ ఓటింగ్ అంటున్నారు.

సాధారణంగా ఓట్లు వేసే చాలామంది ఓటు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అందులో వృద్ధులు, వితంతువులు, మహిళలు ఎమ్మెల్యేకు  టిడిపికి వేసి మరొకటి ఫ్యాన్ వేయాలని  అంత క్లియర్ గా ఉండరు కదా.. అలాగే అరకు రాజంపేట పార్లమెంటులో కూడా వైసిపి అభ్యర్థులు గెలిచారు.కానీ ఒక్క అసెంబ్లీ సీటు కూడా వైసిపి కి రాలేదు. మరి ఇలా ఎందుకు జరిగిందని చర్చిస్తే క్రాస్ ఓటింగ్  అంటారు. ఈ నియోజకవర్గాల్లో ఎంపీలు అంతలా ఏం చేశారు. మిగతా అసెంబ్లీలలో వైసిపి నాయకులు అంత పాపం ఏమి చేశారు.  మరి జనాలు అంతగా ఆలోచించి ఒకటి వైసీపీకి వేసి ఎమ్మెల్యేకు సైకిల్ కి వేశారా.. అసలు ఇందులో ఇంత మ్యాజిక్ ఎలా జరిగింది. మ్యాజిక్ జరిగిందా లేదా మ్యాజిక్ చేశారా అనేది తప్పనిసరిగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో విపరీతంగా  ట్రోల్స్ నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: