అది ఒక్క పవన్ కళ్యాణ్ గెలుపు కాదని, మొత్తం 5 కోట్ల ఆంధ్రుల గెలుపు అని కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఆంధ్రుడికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. ఇక జనసైనికుల ఆనందానికైతే అవధులే లేకుండా పోయాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు గెలిచినంత బాధ్యతను ప్రజలు తమ మీద పెట్టారని పవన్ అన్నారు. గత ఎన్నికల్లో ఒకే సీటును గెల్చుకున్నపుడు ఎలాంటి మానసిక స్థితిని అనుభవించారో ఇపుడు కూడా అలాగే ఉందని, పెద్దగా తేడాలేదని అన్నారు. ఓటమితో పాఠాలు నేర్చుకున్నానే తప్ప నిరాశపడలేదేన్నారు. ధర్మం కోసం నిలబడితే, ధర్మం తనను గెలిపిచిందని, కనిపించని దేవుళ్ళందరికీ ఈరోజున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పవన్ చెప్పారు.
ఇకపోతే ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన మరో పార్టీ జనసేన మాదిరి 100% స్ట్రైక్ రేట్‌ను సాధించింది. ఏపీలో 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన జనసేన అన్నింట్లో విజయం సాధించగా ఎన్డీయే కూటమి సీట్ల పంపకాల్లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి కేటాయించిన 5 ఎంపీ స్థానాల్లో గెలిచి వందశాతం స్ట్రైక్ రేట్‌ను సాధించింది. దీంతో అందరిచూపు ఆ పార్టీ అధినేతలు పవన్ కల్యాణ్, చిరాగ్ పాశ్వాన్ వైపు మళ్లింది. ఇకపోతే తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు, జన సైనికులకు, యువతకు, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పవన్ గెలిచిన సందర్భంగా చెప్పుకొచ్చారు.