ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతుంది. జూన్ 12వ తేదీన అంటే మరో ఆరు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. అదే రోజున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులుగా ఎవరు.. అవుతారు అనే దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చ నెలకుంది.

తెలుగుదేశం కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. అందుకే తెలుగుదేశంకు ఎక్కువ మంత్రులు, అలాగే జనసేనకు మూడు నుంచి నాలుగు, జనసేనకు రెండు నుంచి మూడు మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే సీనియారిటీ, పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడికి... కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని... అందరూ చర్చించుకుంటున్నారు. దాదాపు 7 సార్లు  ఎమ్మెల్యేగా గెలిచిన చింతకాయల అయ్యన్నపాత్రుడు.. వైసిపి పాలనలో చాలా కష్టాలు అనుభవించారు.

అయ్యన్నపాత్రుడుపై వైసీపీ ప్రభుత్వం చాలా కేసులు పెట్టి... జైల్లో కూడా పెట్టింది. అర్ధరాత్రి పూట అరెస్టు కూడా చేసింది. అలాగే.. ఈ ఐదు సంవత్సరాలలో.. పార్టీని కాపాడుకుంటూనే... తెలుగుదేశం కార్యకర్తలకు అండగా నిలిచారు అయ్యన్నపాత్రుడు. ఇటు మొన్నటి ఎన్నికల్లో నర్సీపట్నం వైసిపి అభ్యర్థి ఉమా శంకర్ గణేష్  పై..  24 వేల పైచిలుకు మెజారిటీతో.. గ్రాండ్ విక్టరీ కొట్టారు చింతకాయల అయ్యన్నపాత్రుడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన అయ్యన్నపాత్రుడు...  ఈసారి మాత్రం గెలిచి తన పంథా నెగ్గించుకున్నాడు.

అయితే సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో దాదాపు 5 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు అయ్యన్న. విద్యాశాఖ, రోడ్లు భవనాల శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆర్ అండ్ బి శాఖ మంత్రులుగా... గతంలో పనిచేశారు అయ్యన్నపాత్రుడు. అలాగే ఎంపీగా కూడా 1996లో గెలిచి తన సత్తా చాటారు. ఇలాంటి సీనియర్ నాయకులకు.. చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈసారి నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడుకు రోడ్లు భవనాలు శాఖ  వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: