ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. భారీగా సీట్లు సాధిస్తుందని అనుకున్న వైసీపీకి ఘోర పరాభవం తప్పలేదు. వైసీపీ ఓటమి పైన అనేక విశ్లేషణలు తెర మీదకు వస్తున్నాయి. రాజకీయంగా పలు కారణాల పైన చర్చ జరుగుతోంది.కూటమి గెలుపులో పవన్ పాత్ర హర్షించదగినది . ఇదే సమయంలో ఓటమి పైన వైసీపీ అంతర్మధనం మొదలు పెట్టంది. అయితే, ఆసక్తి కరంగా జగన్ సొంత మీడియా వైసీపీ ఓటమి గురించి కీలక అంశాలను తెలిపింది.వైసీపీ ఓటమి కంటే వచ్చిన స్థానాల పైన ఆ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ పార్టీ ఓటమికి కారణాల పైన జగన్ మీడియా ఆసక్తి కర విషయాలను తెలిపింది.. ప్రభుత్వ పథకాల్లో పార్టీ కార్యకర్తలను భాగస్వాములను చేయకుండా దూరంగా ఉంచడం వలనే ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన పార్టీ శ్రేణులు ,వైసీపీ పరాజయానికి ఇది కూడా ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు..అయితే జగన్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇచ్చిన ప్రతి హామీలను కులం, మతం, వర్గం చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించారు.

ఈ క్రమంలోనే సంక్షేమ పథకాలలో వైసీపీ కార్యకర్తలకు భాగస్వామ్యం కల్పించలేదని,గ్రామ, వార్డు సచివాలయల ద్వారా అందించటం కోసం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసారని వివరించారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలతో తమకు భాగస్వామ్యం కల్పించకపోవటంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర నైరాశ్యానికి గురయ్యారని పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలకు పార్టీ ప్రచారం నుంచి పోలింగ్ కేంద్రాలకు  పార్టీ తరుపున జనాలను తరలించటంలో కార్యకర్తలే ముఖ్య పాత్ర పోషిస్తారు.ఉంటుంది. కానీ, వైసీపీ శ్రేణులలో తీవ్ర నిరాశ నెలకొనడంతో ఈ సారి వైసీపీ ఓటమి పాలైంది.. అయితే వైసీపీ ఓడిపోడానికి మరో కీలక కారణం కూడా వుంది.కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డియే తో కలవడానికి జగన్ ఒప్పుకోకపోవడం ఈ సారి జగన్ ఓడిపోవడానికి ముఖ్య కారణంగా తెలుస్తుంది.ఎన్డియే కూటమికి జగన్ మద్దతు తెలిపితే ముస్లిం, క్రిస్టియన్స్ ఓట్లు పోతాయనే భయంతో జగన్ మద్దతు తెలపలేదని సమాచారం. కానీ ఈ సారి జగన్ ఘోర ఓటమి పాలయ్యారు. జగన్ ఎన్డియే కూటమికి మద్దతు ఇచ్చి ఉంటే కచ్చితంగా పరిస్థితి మరోలా వుండేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: