ఉమ్మడి కడప జిల్లా కడప అసెంబ్లీ స్థానం నుంచి కూటమి తరపున మాధవీరెడ్డి విజయం సాధించడం వైసీపీకి కోలుకోలేని దెబ్బ అనే సంగతి తెలిసిందే. ఉమ్మడి కడప జిల్లా నుంచి ఆమెకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్లే వైసీపీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఏపీ పొలిటికల్ వర్గాల్లో వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.
 
అతి ఆత్మవిశ్వాసంతో జగన్ తీసుకున్న నిర్ణయాలు వైసీపీ పతనానికి కారణమయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అవినాష్ రెడ్డికి జగన్ అండగా నిలబడటం, షర్మిల జగన్ కు వ్యతిరేకంగా పని చేయడం కూడా జగన్ కు మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడటం కూడా ఆ పార్టీకి మైనస్ అయిందని తెలుస్తోంది.
 
చేసిన తప్పులకు వైసీపీ మూల్యం చెల్లించుకుందని తెలుస్తోంది. కడప మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా ఓటమికి ఒక విధంగా ఆయన తమ్ముడు అహ్మద్ బాషా చేసిన పనులు కారణమని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అంజాద్ బాషా సౌమ్యుడు, సహన శీలిగా పేరు తెచ్చుకోగా తమ్ముడు చేసిన తప్పులకు ఆయన ఫలితం అనుభవించాల్సి వస్తోందని తెలుస్తోంది.
 
మాధవీలత చాలా కాలం పాటు కష్టపడి సరైన రీతిలో ప్రచారం చేసి ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించారు. ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతుందని గత కొంతకాలం నుంచి ప్రచారం జరగగా ఆ ప్రచారం ఎట్టకేలకు నిజమైంది. మాధవీలతకు మంత్రి పదవి ఇస్తే ఆమె మంత్రిగా కూడా మంచి పేరు తెచ్చుకోవడం ఖాయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మాధవీలతకు పదవి దక్కుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మాధవీలత ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతారేమో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: