అయితే నారా లోకేష్ కు ఐటి శాఖ, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవి వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ చివరి క్షణంలో తెలుగుదేశం కూటమి.. ప్లాన్ మార్చేసిందట. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. నారా లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసే కెపాబిలిటీ నారా లోకేష్ కు వస్తుందని అనుకుంటున్నారట.
లోకేష్ కు కుటుంబ పాలన ముద్ర పడుతుంది. అందుకే నారా లోకేష్ కు ఇచ్చేందుకు చంద్రబాబు వెనుకాడుతున్నారట. అంతేకాకుండా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే బాటలో ఉన్నారట. పార్టీ కోసం గత పది సంవత్సరాలుగా కష్టపడ్డ నాయకులకు... మంత్రి పదవి వచ్చేలా చూస్తున్నారట. తన స్థానంలో మరొక నాయకుడికి... మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారట. కేవలం తాను జనసేన అధినేతగా ఉండి... ఏపీ ప్రభుత్వానికి సలహాలిస్తూ ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారట.
అదే సమయంలో జనసేన నాయకులకు కింది స్థాయిలో అలాగే మంత్రి పదవులలో... న్యాయం జరిగేలా చూసుకుంటున్నారట. ఈ మేరకు చంద్రబాబుతో చర్చలు కూడా చేస్తున్నారట. జనసేన నుంచి కనీసం ఆరుగురు మంత్రులు ఉండేలా స్కెచ్ వేస్తున్నారట జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందుకోసమే తాను తప్పుకొని... కేవలం పార్టీ బాధ్యతలు చూసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారట. అలా చేస్తేనే పార్టీ కష్టపడ్డ వారికి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారట.