అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎస్ మార్పు అనివార్యమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సిఎస్ రాబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సిఎస్ గా విజయానంద్ అనే ప్రభుత్వ అధికారిని నియమించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం విజయానంద్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా విజయనందు పనిచేశారు. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇవాళ సాయంత్రం... దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం అందుతుంది.
ఇది ఇలా ఉండగా, అటు శెలవుపై సీఎస్ జవహర్ రెడ్డి.... వెళ్లారు. ఆయన మళ్లీ రావడం కష్టమేనని అంటున్నారు. దీంతో సాయంత్రంలోగా కొత్త సీఎస్ నియామకం ఉంటుందట. అంతేకాదు.... రాజీనామా చేసినా.. చేయకున్నా.. సలహాదారులను వెంటనే పదవుల నుంచి తప్పించాలని ఆదేశించదట కొత్త సర్కార్. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందట ఆంధ్ర ప్రదేశ్ కొత్త ప్రభుత్వం. ఇక అటు పీకి డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు జారీ చేశారట.