మోడీ మరోసారి భారత ప్రధాని కావాలని అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా వంటి ఎన్నో పాశ్చాత్య దేశాలు బలంగా కోరుకున్నాయి. భారత్‌తో బలమైన సంబంధాలను ఆయా దేశాలు నెలకొల్పాయి. అయినప్పటికీ మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి మోడీ ప్రధాని కానున్నారు. గతంలో విదేశాంగ విధానంలో భారత్ వైఖరి బలంగా ఉండేది. భారత వైఖరికి అమెరికా సహా ఎన్నో దేశాలు మద్దతు పలికేవి. ప్రపంచంలో అగ్రగామి రాజ్యంగా భారత్‌ను నిలబెట్టాలని మోడీ భావించే వారు. ఏదేమైనా అమెరికా భారత్‌కు మద్దతుగా నిలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రధాని మోదీకి ట్వీట్‌లో అభినందనలు తెలిపారు. మరో వైపు పాక్ మాత్రం మోడీ ప్రాబల్యం తగ్గిందని, తక్కువ మెజార్టీతో ఆయన గెలిచారని మీడియాలో ప్రచురించింది. చైనా కూడా మోడీకి శుభాకాంక్షలు తెలిపినా, ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వుతుందో తెలియని పరిస్థితి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా మోడీకి విషెస్ తెలియజేశారు. బంగ్లాదేశ్ ఆవిర్భావం నుంచి ఆ దేశంతో భారత్ మైత్రి కొనసాగుతోంది. మున్ముందు కూడా అది కొనసాగే అవకాశం ఉంది. మోడీకి మెజార్టీ తగ్గడాన్ని కొన్ని దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అయితే మోడీ మూడో సారి ప్రధాని అవ్వడంతో పాటు విదేశాంగ శాఖను కూడా తమ వద్దే ఉంచుకోనున్నారు. దీంతో గతంలో మాదిరిగానే విదేశాల్లోనూ భారత్ ప్రాధాన్యం అలాగే కొనసాగే అవకాశం ఉంది.