అందుకే వైసిపి పార్టీకి ఇంత ఘోరంగా ఓడిపోయే పరిస్థితి వచ్చింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అంతేకాకుండా గతంలో కూడా ఎంతో అనుభవం చంద్రబాబుకి ఉంది.. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు 50 ఏళ్లకే పెన్షన్ 4000 అని చెప్పారు.. జగన్ మాత్రం మూడు వేల రూపాయల పెన్షన్ ఆ తర్వాత 3500 చేస్తానని చెప్పారు. ప్రస్తుతం 66 లక్షల మంది తీసుకుంటున్నారు.. 50 ఏళ్లకే పెన్షన్ వేసుకుంటే దాదాపుగా కోటి మందికి పైగా అవుతారు.
కోటి మందికి నాలుగువేల రూపాయలు వస్తూ ఉంటే వైసీపీకి ఎందుకు ఓటు వేస్తారని పలువురు నేతలు చెబుతున్నారు. క్రిందటి సారి కూడా తెలుగుదేశం పార్టీ చివరిలో ఇచ్చిన 10000 కి మహిళలు క్యూ కట్టి ఓటు వేశారు అనుకున్నారు.. అప్పుడు కూడా సైలెంట్ ఓటింగ్ ఏ. ఇప్పుడు కూడా మహిళలందరూ క్యూలో నిలబడి మనకి ఓటు వేశారని వైసీపీ అనుకున్నది.. ఇంతకంటే ఎక్కువ వస్తాయని మహిళలు ఫీల్ అయ్యారు కాబట్టి టిడిపి పార్టీకి ఓటు వేశారని టిడిపి నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా వికలాంగులకు కూడా ఈసారి 6000 రూపాయలను చేశారు చంద్రబాబు. వాలంటరీలలో ఐదువేల రూపాయల బదులు 10000 చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఏ ఆశ అయితే వైసీపీని బతికించిందో 2019లో అదే ఆశ 2024లో టిడిపిని గెలిపించిండవచ్చు.