•పవర్ స్టార్ వల్లే టీడీపీకి పునర్జీవం..

•పవన్ వ్యూహాత్మక రచన ఫలించింది..

•డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు..



(అమరావతి - ఇండియా హెరాల్డ్)


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాలలో తన నటనతో,  మేనరిజంతో ఎంతోమంది అభిమానులను అభిమానాన్ని చూరగొన్న పవన్ కళ్యాణ్ నేడు ప్రజల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నారనడానికి నిదర్శనం ఇంకొకటి లేదు.. 2014 లో పోటీ చేసి పార్టీని నిలబెట్టుకోలేకపోయారు. ఇక 2019లో కూడా పోటీ చేసి కేవలం రెండు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.. కానీ ఆ సమయంలో ఎన్నో అవమానాలు,  ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొని.. ఆత్మ శుద్ధి చేసుకుని అంతే వేగంగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 స్థానాలలో పోటీ చేసి 21 స్థానాలలో కూడా గెలిచి తన స్టామినా ఏంటో నిరూపించి జనసేన పార్టీ జెండాను బలంగా పాతారు..


తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే టిడిపి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పునర్జన్మ ఇచ్చారని చెప్పవచ్చు. ఇకపోతే 2014లో చంద్రబాబు నాయుడు టిడిపి పార్టీ తరపున మేనిఫెస్టోని ప్రకటించి.. మేనిఫెస్టోని నెరవేర్చకపోవడంతో ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది .. అందుకే 2019 ఎన్నికలలో ఆయన గెలవలేకపోయారు. మరొకవైపు 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి పథకాన్ని అమలు చేసి 99% సక్సెస్ అయ్యింది.. దీంతో అందరూ కూడా వైసిపి మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని 2020 నుంచే కామెంట్లు చేస్తూ వచ్చారు.. దీంతో టీడీపీలో కొత్త భయం చుట్టుకుంది.. ఈసారి గెలవకపోతే ఇక పార్టీ భూస్థాపితం కావాల్సిందే అన్న వార్తలు కూడా వినిపించాయి.. ఇలాంటి సమయంలోనే రాజకీయంలో ఆరి తేదీన నారా చంద్రబాబు నాయుడు ఓట్లను చీల్చకుండా.. అధికారంలోకి రావాలని ప్రయత్నించాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని ఆయన ఉపయోగించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యూహాత్మక రచనతో బిజెపిని కూడా తమలో కలుపుకొని మొత్తం మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అటు బిజెపి ఓట్లను ఇటు జనసేన,  టిడిపి ఓట్లను ఏమాత్రం చీలకుండా కూటమిగా తమకే వచ్చేలా చేసుకుని నేడు ఎవరు ఊహించనన్ని సీట్లను దక్కించుకొని.. ఆంధ్రప్రదేశ్లో రికార్డు సృష్టించారు నారా చంద్రబాబు నాయుడు.. అయితే ఇదంతా సాధ్యం అవడానికి  ఒక్క పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి..  పవన్ కళ్యాణ్ 21 స్థానాలలో పోటీ చేయగా 21 స్థానాలను కైవసం చేసుకున్నారు.  బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలను దక్కించుకోగా.. టిడిపి 144 స్థానాలలో పోటీ చేసి 135 స్థానాలను దక్కించుకుంది.. మొత్తంగా కూటమి 164 స్థానాలను కైవసం చేసుకొని కనీ వినీ ఎరుగని రికార్డును దక్కించుకున్నారనే చెప్పాలి. ఇక ఈ లెక్కన చూసుకుంటే చాలామంది పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీకి ఓట్లు వేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా రైతులకు అండగా నిలవడమే కాదు.. ఎంతోమందికి ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు.. అది కూడా అధికారంలో లేని సమయంలో.. ప్రత్యేకించి తన అన్నదమ్ములు ఇద్దరు సహాయ సహకారాలతో ప్రజలకు, రైతులకు మంచి చేకూర్చడం వల్లే పవన్ కళ్యాణ్ కు పట్టం కట్టాలని భావించిన ప్రజలు నేడు వారిని అధికారంలోకి తీసుకొచ్చారు.. ఇక అందులో భాగంగానే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకొని ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: