పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సినీ నటుడు. ఆయన కుటుంబంలో ఒక్కరికి కూడా విజయవంతమైన రాజకీయ జీవితం లేదు. ఆయన అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టి దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఏపీలో కమ్మ, రెడ్డి నాయకులే ఇప్పటిదాకా ఏలుతూ వస్తున్నారు. ఆ నాయకులకు సుదీర్ఘమైన, విజయవంతమైన పొలిటికల్ కెరీర్ ఉంది. అలాంటి వారితో పోటీపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఆంధ్ర ప్రజలకు మంచి చేయాలని పవన్ కళ్యాణ్ ఒక లక్ష్యం పెట్టుకున్నారు. అంత పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని ఆయన ముందడుగు వేయడమే ఆయన ధైర్యానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

* సక్సెస్‌కి హార్డ్ వర్క్ కీలకం

పవన్ 2014 నుంచి 2024 వరకు 10 బాగా కష్టపడ్డారు. టీడీపీని, బీజేపీ ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక టీడీపీ పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్నా వేళ దానికి పునర్జీవం పోసిన నేత పవన్ కళ్యాణ్. చంద్రబాబుతో పాటు మోదీలో కూడా మనదే అధికారం అని చెబుతూ పవన్ కళ్యాణ్ వారిని బాగా కష్టపడేలాగా ప్రోత్సహించారు. ఆయన కూడా రాష్ట్రమంతటా తిరుగుతూ ఎన్నో అవమానాలను, దాడులను ఫేస్ చేశారు. గడిచిన 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చూడని కష్టం లేదు. అయినా వాటిని ఓపికతో భరించారు. కేవలం 21 సీట్లు మాత్రమే అధికారంలోకి రావడమే తమ ధ్యేయం అని త్యాగం కూడా చేశారు. చంద్రబాబు కంటే ఎక్కువ కష్టపడ్డారు.

* చెరగని ఆత్మవిశ్వాసం

గత పదేళ్ల కాలంలో పవన్‌ను ఎంతోమంది అవమానించారు. పదేళ్లలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేని, చేతగాని నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ రోజా లాంటి వారు చాలా తీవ్రంగా విమర్శించారు. కార్లు మార్చినట్టు పెళ్లాలను మారుస్తాడు అని మాజీ ఏపీ సీఎం జగన్ కూడా వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారు. ఆవేశపరుడు, అబద్దాలకోరు, పొత్తులేనిదే గెలవలేడు, దత్తపుత్రుడు అని ఎన్నో విమర్శలు చేశారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఎవరేమనుకున్నా తాను మాత్రం చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోయారు. జగన్‌ను అతను అధః పాతాళంలోకి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదంటూ శపథం చేశారు. అవే మాటలను నిజం చేసి చూపించారు. అధికారంలోకి రావాలనుకున్నారు, వచ్చారు.

* మంచి మనసుతో ప్రయత్నిస్తే విజయం తథ్యం  

పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లోకి రాకముందే పవన్ చాలా మంచి పనులు చేశారు. నీళ్లు లేక కష్టపడుతున్న ఎన్నో గ్రామాలలో తన సొంత డబ్బులతో బోర్లు వేయించారు. పబ్లిసిటీ చేసుకోలేదు కానీ ఆయన చేసిన దానధర్మాలు ఎన్నో ఉన్నాయి. ఇక నాగబాబు, సాయి ధరంతేజ్ ఫ్యామిలీలను ఎంతగానో ఆదుకున్నారు పవన్. ఒకానొక దశలో మాజీ భార్య రేణు దేశాయ్ కూడా పవన్ వ్యక్తిగతంగా మంచివాడే, అతనికి ఓటు వేసి గెలిపించండి అని ప్రచారం చేసింది. అంత మంచి మనసు ఈ హీరో సొంతం. కుటుంబానికి చేసినట్లు ఏపీ ప్రజలకు కూడా మంచి చేయాలని ఆయన నిజంగా భావించారు. నిజాయితీగా మంచి మనసుతో ప్రయత్నించి చివరికి విజయం సాధించారు.

* విజయం సాధించినా ఒదిగి ఉండే నైజం

పవన్ ఈసారి ఎన్నికల్లో 100% అసెంబ్లీ ఎంపీ సీట్లు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. అంత పెద్ద విజయం సాధించిన ఆయన ఎలాంటి అతి ప్రదర్శించలేదు. ఇల్లు అలకగానే పండుగ కాదు అంటూ ఏపీ ప్రజలకు తాను చేయాల్సిన బాధ్యతలు గురించి గుర్తు చేసుకున్నారు. గెలిచిన మరో క్షణం నుంచే ఆయన ఏపీ ప్రజలకు ఎలా మంచి చేయాలా అనే ఆలోచనలో పడిపోయారు. లక్ష సాధింపు రాజకీయాలకు అస్సలు వెళ్లను అని మాటిచ్చారు. ఇలాంటి ఆర్భాటాలకు పోకుండా విజయం సాధించిన ఒదిగి ఉండాలనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

* డోంట్ గివ్ అప్

 పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ చూస్తే ఆయన ఏ నిమిషంలో కూడా తన ప్రయత్నాలను వదులుకోలేదు. డోంట్ గివ్ అప్ ఆటిట్యూడ్‌తో చివరికి సక్సెస్ సాధించారు. ఇదే మనస్తత్వంతో యువత ఉండాలి.

* సపోర్ట్ సిస్టమ్‌ ఏర్పరచుకోవాలి

పవన్ మద్దతు, ఐకమత్యమే బలమని నమ్మారు. ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్‌ లేకపోతే ఎవరైనా సరే జీవితంలో విజయం సాధించలేరు. ఉదాహరణకు పిల్లలకు ప్రోత్సహించే, గైడెన్స్ అందించే తల్లిదండ్రులు, టీచర్లు ఉండాలి, ఒంటరిగా పోరాటం చేస్తానంటే విజయం సాధించడం అసాధ్యంగా మారొచ్చు. సింహం సింగిల్ గానే వస్తుంది అనే ఈగోలకు పోతే చివరికి పతనం కావడం కచ్చితం.

మరింత సమాచారం తెలుసుకోండి: